calender_icon.png 30 June, 2025 | 6:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాట్రపాడులో గ్రామ దేవతకు కొలుపులు

30-06-2025 12:44:12 AM

హాజరైన ఎనుముల పోతురాజు యాదవ్ 

గుంటూరు, జూన్ 29 (విజయక్రాంతి): వట్టిచెరుకూరు మండలం కాట్రపాడు గ్రామంలో వెలసిన గ్రామ దేవత అద్దంకమ్మకు ఆదివారం కొలుపులు నిర్వహించారు. ఈ కొలుపులో ఎనుముల పోతురాజు యాదవ్ పాల్గొని మాట్లాడారు. గ్రామస్థులను చల్లగా చూస్తూ, వ్యాధుల నుంచి రక్షిస్తూ, పంటలను పచ్చగా ఉండేలా చేస్తూ, గ్రామ పొలిమేరలలో సదా కాపు కాస్తూ ఉండే దేవతలకు కొలుపులు చేయడం ఎంతో అదృష్టమని అన్నారు. గ్రామదేవతల పూజావిధానం, తరతరాలుగా మనకు వస్తున్న గ్రామీణ సంప్రదాయం గ్రామస్థులకు వివరించారు. తదుపరి కోలాటాలతో, కర్ర సాధనాలతో, వీర తాళ్ళతో జాతర చేస్తూ గ్రామ దేవతకు నైవేద్యం అందించారు.