calender_icon.png 25 October, 2025 | 1:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు ఢిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

25-10-2025 12:00:00 AM

డీసీసీ అధ్యక్షుల ఎంపికపై పార్టీ పెద్దలతో చర్చ   

హైదరాబాద్, అక్టోబర్ 24 (విజయక్రాంతి) : జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల ఎంపికపై పార్టీ అధిష్ఠానం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. అందుకు తెలంగాణ తో పాటు రాజస్థాన్, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాల్లో డీసీసీ అధ్యక్షుల నియామకానికి సంబంధించి పరిశీలకులను నియమించింది. అందులో భాగంగా తెలంగాణకు 22 మంది పరిశీలకులను నియమించిన విషయం తెలిసిందే.

డీసీసీ అధ్యక్షుల ఎంపికకు సంబంధించి శనివారం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాల యంలో పార్టీ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే అధ్యక్షతన సమా వేశం జరగనుంది. ఈ సమావేశానికి హాజరయ్యేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కు మార్‌రెడ్డి శనివారం ఢిల్లీకి వెళ్లనున్నారు.