24 August, 2026 | 10:27 PM

Breaking News

భద్రాచలం రోటరీ క్లబ్‌కు ప్రత్యేక గుర్తింపు   •   8 దేశాల తైక్వాండో పోటీలో భారత్‌కు బంగారు పతకం   •   మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి   •   ఐటీఐలో ఖాళీ సీట్ల భర్తీకి అవకాశం   •   ఆలేరు జెడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థులకు అన్వర్ స్కాలర్‌షిప్   •   ఒంటరి మహిళల సర్టిఫికెట్లకు తిప్పలు!   •   సంగమేశ్వర స్వామివారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   గణేష్ మాండపాలకు ఉచిత కరెంటు ఇవ్వాలని వినతి   •   చిరుతపులి చర్మం, గోర్లను అక్రమంగా విక్రయించేందుకు ప్రయత్నించిన నలుగురు వ్యక్తులు అరెస్ట్   •   యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి   •  

రికార్డుస్థాయి సెట్‌లో రాజాసాబ్

16-06-2025 12:45 AM

హీరో ప్రభాస్, డైరెక్టర్ మారుతి, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కాంబినేషన్‌లో రూపొందుతున్న క్రేజీ మూవీ ‘రాజాసాబ్’. హారర్ కామెడీ జానర్‌లో ఎవర్ గ్రీన్ మూవీగా నిలిచిపోయేలా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు మారుతి. ప్రభాస్ ఇప్పటిదాకా చేయని రొమాంటిక్ హారర్ జానర్‌లో నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. టీజీ విశ్వప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఈ మూవీ అప్‌డేట్ గురించి చాలా రోజులుగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ క్రమంలో చిత్ర నిర్మాణ సంస్థ టీజర్ అప్‌డేట్‌ను ఇచ్చింది. జూన్ 16న ఉదయం 10.52 గంటలకు టీజర్‌ను విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధికుమార్, సంజయ్‌దత్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 5న హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాకు వేసిన భారీ హవేలీ సెట్ ప్రధాన ఆకర్షణ కాబోతోంది. 41,256 స్క్వేర్ ఫీట్ విస్తీర్ణంతో ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్ నంబియార్ ఈ రికార్డ్ స్థాయి హవేలీ సెట్‌ను రూపొందించారు. భారతీయ సినీ చరిత్రలో మరే హారర్ మూవీకి ఇంత భారీ సెట్ నిర్మించలేదు.

ఈ హవేలీ సెట్ గురించి ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్ నంబియార్ స్పందిస్తూ.. ‘హవేలీలోని ప్రతి అడుగు ఒక ఎమోషన్‌ను వ్యక్తీకరిస్తుంది. చూసేందుకు మాత్రమే హాంటెడ్ హౌస్‌లా ఉండటం కాదు. హాంటెడ్ హౌస్‌లో మనమంతా ఉన్న ఫీల్ కలిగిస్తుంది. ఈ హవేలీ చూస్తుంటే మీకు కథలోకి వెళ్లిన అనుభూతి కలుగుతుంది’ అన్నారు. జూన్ 16 సోమవారం ఈ మూవీ టీజర్ లాంచ్ చేయనున్నారు. ఈ సందర్భంగా నేషనల్, స్టేట్ మీడియాకు ఈ హవేలీని ప్రత్యక్షంగా చూపించబోతున్నారు.