24 August, 2026 | 11:38 PM

Breaking News

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రచ్చబండ కార్యక్రమం: ఎమ్మెల్యే జారె   •   27న కలెక్టరేట్ ముందు మహాధర్నాను జయప్రదం చేయండి: టిజి ఈజేఏసీ   •   వీఎస్టీ కాలనీ అధ్యక్షుడికి ప్రశంసా పత్రం అందజేసిన ఏసీపీ వేంకట్ రెడ్డి   •   కాసాల–రెడ్డిఖానాపూర్ కూడలిలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి   •   వార్డెన్ రమేష్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం పాల్గొన్న విద్యార్థులు   •   భద్రతకు సీసీ కెమెరాలు అత్యంత కీలకం : ఉప్పల్ డిసిపి   •   రేగన్న రాకతో కార్యకర్తల్లో జోష్   •   విరాహత్ అలీని పరామర్శించిన నర్సాపూర్ ఎమ్మెల్యే   •   చెరువులో పడి జీపీ వర్కర్‌ మృతి   •   మంథనికి విద్యుత్ వెలుగులు మరింత పటిష్టం   •  

కన్నప్పపై ఆ శివుడి అనుగ్రహం ఉండాలి

16-06-2025 12:42 AM

విష్ణు మంచు టైటిల్ రోల్‌లో నటించిన చిత్రం ‘కన్నప్ప’. ఈ చిత్రానికి ముఖేశ్‌కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. అవా ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్‌బాబు నిర్మించారు. ఈ సినిమా జూన్ 27న రిలీజ్ కానుంది. శనివారం రాత్రి కొచ్చిలో టీమ్ ట్రైలర్‌ను రిలీజ్ చేశా రు. ఈ ఈవెంట్‌లో చిత్ర కథానాయకుడు విష్ణు మాట్లాడుతూ.. “కన్నప్ప’ మూవీ ఆ శివుడి ఆశీస్సులతోనే జరిగింది. మోహన్‌లాల్‌కు నేను పెద్ద అభిమానిని. ఆయన ప్రభావం అన్ని తరాలపై ఉంటుంది.

ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం నా పూర్వజన్మ సుకృతం” అన్నారు. మోహన్‌బాబు మాట్లాడుతూ.. “మోహన్‌లాల్ మలయాళ మూవీ ‘చిత్రం’ను తెలుగులో నేను ‘అల్లుడు గారు’గా రీమేక్ చేశాను. అలా మా బంధం మొదలైంది. ఈ సినిమా కోసం ఇంతవరకు మోహన్‌లాల్ ఒక్క రూపాయీ తీసుకోలేదు. నా ఇన్నేళ్ల కెరీర్‌లో ఆయనతో కలిసి నటించలేకపోయా. ఇప్పుడైనా ఛాన్స్ ఇవ్వమని అడుగుతున్నా” అన్నారు. మోహన్‌లాల్ మాట్లాడుతూ.. “ప్రస్తుతం భాషా హద్దుల్లేకుండా సినిమాల్ని తీస్తున్నారు. ఇంత మంచి చిత్రంలో నేను భాగమైనందుకు ఆనందంగా ఉంది.

ఆ శివుడి అనుగ్రహం ‘కన్నప్ప’ చిత్రంపై ఉండాలని కోరుకుంటున్నా” అన్నారు. దర్శకుడు ముఖేశ్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. “సినిమాను అందరూ ప్రేమతో, ఇష్టంతో తీస్తారు.. మేం మాత్రం ఈ మూవీని శివుడికి ఓ ప్రార్థనలా తీశాం. శివతత్త్వాన్ని చాటేలా ఈ మూవీని తీశాం. నటనపై ప్యాషన్, డెడికేషన్, సినిమా పట్ల ఉన్న నాలెడ్జ్ గురించి మోహన్ బాబు నుంచి ఎంతో నేర్చుకున్నా. ఆఫ్‌స్క్రీన్‌లో లాల్‌ను చూసిన తర్వాత నేనూ ఆయనలానే ఉండాలని అనుకుంటు న్నా. విష్ణు ఈ మూవీ కోసం ఎంతో కష్టపడ్డారు’ అని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో అర్పిత్ రంకా, ముఖేష్ రిషి, ఆశీర్వాద్ అధినేత ఆంటోని పెరంబవూర్ పాల్గొన్నారు.