4 May, 2026 | 3:41 AM

మిట్టల్ ఫ్యామిలీ చేతుల్లోకి రాజస్థాన్ ఫ్రాంచైజీ

04-05-2026 02:18 AM
  1. పూనావాలాతో కలిసి కొనుగోలు
  2. డీల్ విలువ రూ.15.600 కోట్లు

ముంబై, మే 3: రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ కొత్త యాజమాన్యం చేతుల్లోకి వెళ్లిం ది. ప్రముఖ పారిశ్రామికవేత్త లక్ష్మీ ఎన్. మిట్టల్ కుటుంబం, సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా అధినేత అదర్ పూనావాలాతో కలిసి ఈ ఫ్రాంచైజీని కొనుగోలు చేశారు. మనోజ్ బడాలే నేతృత్వంలోని కన్సార్టియం నుంచి ఈ ఫ్రాంచైజీని కొనుగోలు చేస్తున్నట్లు మిట్టల్ కుటుంబం ప్రకటింటింది. ఈ డీల్ విలువ దాదాపు రూ.15,600 కోట్లు. ఐపీఎల్ చరిత్రలోనే ఇది అత్యంత భారీ ఒప్పందాల్లో ఇది ఒకటి. నిజానికి రాజస్థాన్ రాయ ల్స్‌ను కొనుగోలు చేయడానికి అమెరికా వ్యాపారవేత్త కల్ సోమానీ నేతృత్వంలోని కన్సార్టియం ముందుకొచ్చింది. వీరు 1.63 బిలియన్ డాలర్లకు బిడ్ దాఖలు చేశారు.

అయితే, నిధుల సేకరణలో సమస్యలు తలెత్తడం, ఇతర సమస్యల కారణంగా ఒప్పందం కార్యరూ పం దాల్చలేదు. దీంతో కల్ సోమానీ రేసు నుండి తప్పుకోవడంతో మిట్టల్ కుటుంబం రంగంలోకి దిగింది. వీరికి తోడుగా అదర్ పూనావాలా కూడా భాగస్వామిగా మారి ఈ టీమ్‌ను తమ సొంతం చేసుకున్నారు. రాజస్థాన్ రాయల్స్ టీమ్‌లో మిట్టల్ ఫ్యామిలీకి దాదాపు 75 శాతం మెజారిటీ వాట ఉంటుందని తెలుస్తోంది. అదర్ పూనావాల 18 శాతం వాటా, పాత పెట్టుబడిదారు డు మనోజ్ బదాలేతో పాటు మరికొందరికి 7 శాతం వాటా చెందుతుంది.