శ్రీ సాయినగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రాజేందర్ రెడ్డి ఏకగ్రీవం
బడంగ్పేట్, ఆగస్టు 3 (విజయక్రాంతి):బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ సాయి నగర్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా బొక్క రాజేందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు.
ఉపాధ్యక్షుడు: జి. శ్రీనివాస్ రావు,ప్రధాన కార్యదర్శి జెనిగే జంగయ్య యాదవ్, కోశాధికారి వి. విశ్వేశ్వరరావు, సలహాదారులు సి.వి.రామకృష్ణ, జె.వి.ఎస్.ఆర్.కె. ప్రసాద్, సీహెచ్. వెంకటేశ్వర్లు ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన రాజేందర్ రెడ్డి మాట్లాడతూ.. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన కాలనీ వాసులకు ధన్యవాదాలు తెలిపారు. అందరి సహకారంతో శ్రీ సాయి నగర్ సమగ్ర అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నూతన కమిటీకి కాలనీ వాసులు శుభాకాంక్షలు తెలిపారు.






