ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు
మహంకాళి ఆలయం ఈవో గుత్తా మనోహర్ రెడ్డి
సికింద్రాబాద్,ఆగస్టు03 (విజయ క్రాంతి): లక్షల మంది భక్తులు పాల్గొన్న ఉజ్జయినీ మహంకాళి బోనాల జాతర విజయవంతం కావడానికి చేసిన ప్రతి ఒక్కరికి ఈవో గుత్తా మనోహర్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. బోనాల జాతరకు నిధులు కేటాయించడంతో పాటు వివిధ శాఖల అధికారులను సమన్వయం చేసేందుకు సత్వర నిర్ణయాలు తీసుకునేందుకు సహకరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, స్థానిక ఎమ్మెల్యే తలసాని శ్రీనివాసయాదవ్, కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కోట నీలిమా,ధర్మకర్తల మండలి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.
అలాగే భక్తులు అధిక సంఖ్యలో వచ్చినా అమ్మవారి దర్శనం కోసం సహనంతో వేచి చూసిన భక్తులు, పలహార బండ్ల నిర్వాహకులు, సేవలు అందించిన వాలింటీర్ల, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల ప్రతినిధులకు మనోహర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. కేవలం అమ్మవారిపై ఉండే భక్తితో ప్రతి ఒక్కరు నిస్వార్ధంగా సేవలు అందించారని ఈవో గుత్తా మనోహర్ రెడ్డి పేర్కొన్నారు.






