రాజీవ్ గాంధీ సేవలు చిరస్మరణీయం
నాగిరెడ్డిపేట్,మే 21 (విజయక్రాంతి): మండల కేంద్రంలో దేశ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా మండల కాంగ్రెస్ నాయకులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ... దేశ ప్రజల కోసం అహర్నిశలు పనిచేసి ప్రాణత్యాగం చేసిన మహానేత రాజీవ్ గాంధీ అని కొనియాడారు.దేశ యువతకు రాజకీయాల్లో భాగస్వామ్యం కల్పించేందుకు ఓటు హక్కు వయస్సును 21 నుంచి 18 సంవత్సరాలకు తగ్గించిన దూరదృష్టి నాయకుడు రాజీవ్ గాంధీ అని పేర్కొన్నారు.గ్రామీణ స్థాయిలో మహిళలకు అవకాశాలు కల్పించేందుకు స్థానిక సంస్థల్లో మహిళా రిజర్వేషన్లు తీసుకువచ్చి మహిళా సాధికారతకు బాటలు వేసిన నేతగా గుర్తు చేశారు.
అలాగే దేశంలో సమాచార సాంకేతిక రంగ అభివృద్ధికి రాజీవ్ గాంధీ చేసిన కృషి అమోఘమని, ఆయన వేసిన ఐటీ పునాదుల వల్లే నేడు భారతీయులు ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో కీలక స్థానాల్లో కొనసాగుతున్నారని నాయకులు తెలిపారు.అనంతరం ప్రాథమిక ప్రభుత్వ దావఖానలో రోగులకు పండ్ల పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీధర్ గౌడ్,వర్కింగ్ ప్రెసిడెంట్ వాసు రెడ్డి,నాయకులు రామచంద్రారెడ్డి,ఫారుక్, సాయగౌడ్,లక్ష్మణ్ ఠాగూర్, బోరంచ స్థాయిలు,గంపల వెంకన్న,వజ్రా నాయక్, ప్రభాకర్,సురేందర్ గౌడ్,గులాబ్ హుస్సేన్,మురళి గౌడ్,బాబు, మునిగేపల్లి సంగయ్య, నారాయణరెడ్డి,గోపాల్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.






