21 May, 2026 | 5:30 PM

విద్యార్థులు క్రీడల పట్ల ఆసక్తి కనపర్చాలి: మేయర్ మూడ్ గణేష్

21-05-2026 04:35 PM

వేసవిలో క్రీడా శిబిరాలను వినియోగించుకోవాలి...

కొత్తగూడెం మే 21 విజయక్రాంతి: రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రగతి ప్రణాళిక లో భాగంగా, ఈనెల 18వ తేదీ నుండి 23వ తేదీ వరకు జరిగే యూత్ ఫెస్టివల్ లో భాగంగా, జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో త్రీ ఇంక్లైన్ లోని తెలంగాణ క్రీడమైదానం నందు కొనసాగుతున్న రెజ్లింగ్ వేసవి శిక్షణ శిబిరంలో పాల్గొంటున్న 50 మంది బాల,బాలికలకు గురువారం ఉదయం  వివిధ కేటగిర్లలోరెజ్లింగ్ పోటీలను నిర్వహించారు .ఈ  ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా కొత్తగూడెం నగర మేయర్ , మూడ్ గణేష్ ,డిప్యూటీ మేయర్ లలిత ,జిల్లా క్రీడాధికారి యం పరంధామ రెడ్డి , టీ.పీ.సీ.సీ ప్రధాన కార్యదర్శి ,జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు నాగ సీతారాములు  పాల్గొన్నారు. నగర మేయర్ మూడ్ గణేష్ శిబిరాలను లాంచనంగా ప్రారంభించారు. అనంతరం  బాల, బాలికలకు వివిధ కేటగిరీలలో జరిగిన రెజ్లింగ్ పోటీలలో ప్రతిభ కనబరిచిన బాల,బాలికలకు  మేయర్, డిప్యూటీ మేయర్ ,జిల్లా క్రీడా అధికారి , ,టి.పి.సి.సి ప్రధాన కార్యదర్శి మరియు జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ,  బాల బాలికలకు పతకాలను సర్టిఫికెట్లను అందజేశారు .

ఈ సందర్భంగా కొత్తగూడెం నగర మేయర్ మూడ్ గణేష్  మాట్లాడుతూ, ముందుగా వేసవి శిక్షణ శిబిరంలో పాల్గొన్న బాల,బాలికలను అభినందిస్తూ ,యూత్ ఫెస్టివల్ లో భాగంగా జరిగిన రెజ్లింగ్ పోటీలలో సత్తా చాటి న బాల,బాలికలంతా చదువుతోపాటు క్రీడల పట్ల ఆసక్తి కనబరచాలని ప్రభుత్వం క్రీడాకారులను అనేక విధాలుగా ప్రోత్సహిస్తుందని ,అందరూ సద్వినియోగం చేసుకొని మంచి క్రీడాకారులుగా ఎదిగి చదువుతోపాటు ఉద్యోగాల్లో ప్రభుత్వం కల్పిస్తున్న క్రీడారిజర్వేషన్ ద్వారా మంచి భవిష్యత్తు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. అనంతరం

జిల్లా క్రీడా అధికారి  పరంధామ రెడ్డి  మాట్లాడుతూ, జిల్లా అధికార యంత్రాంగం సహకారంతో, క్రీడాకారులకు అన్ని విధాలుగా శిక్షణ సామాగ్రిని అందించడం జరిగింది, కొన్ని క్రీడా మైదానాలు  సైతం సిద్ధమయ్యాయి ,మరికొన్ని త్వరలో పూర్తి కానున్నాయి. కొత్తగూడెంలో బృందావనం వద్ద ఒక స్టేడియాన్ని ఏర్పాటు చేసేందుకు ,ఒక ప్రణాళిక  రూపొందించడం జరిగింది త్వరలో స్థానిక శాసనసభ్యులు ,కలెక్టర్  నగర మేయర్ గార్ల సహకారంతో, అది కూడా పూర్తి అయ్యి త్వరలోనే అందుబాటులో రావాలని కోరుకుంటున్నాను అని ఆయన తెలిపారు. టి.పి.సి.సి.ప్రధాన కార్యదర్శి జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు నాగ సీతారాములు మాట్లాడుతూ, ప్రభుత్వం  ప్రతిభవంతులైన క్రీడాకారులకు అన్ని రకాలుగా ప్రోత్సాహం అందిస్తుందని క్రీడాకారులకు జిల్లా స్పోర్ట్స్ అథారిటీ  ద్వారా కావలసిన శిక్షణ సామాగ్రిని అందించడం జరుగుతుందని బాల ,బాలికలు చదువుతోపాటు క్రీడలు పట్ల ఆసక్తి కనబరిచి మంచి ప్రతిభవతులుగా ఎదిగి రాష్ట్ర,జాతీయ స్థాయిలో పతకాలు గెలుపొంది జిల్లా ఖ్యాతిని చాటాలని ఆయన సూచించారు .

జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి , రెజ్లింగ్ వేసవి శిక్షణ శిబిరాo ఇంచార్జ్ పెదపాటి కాశీ హుస్సేన్ ,పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో త్రీ ఇంక్లైన్ గ్రామపంచాయతీ సర్పంచ్ శ్రీమతి ఈసం ప్రవళిక ,ఉప సర్పంచ్ పాల్తీయ లక్ష్మి ,జిల్లా ఇండియన్ స్టైల్ రెజ్లింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి  బరిగెలభూపేష్ , జిల్లా రెజ్లింగ్అసోసియేషన్ ఉపాధ్యక్షులు ఆదినారాయణ, గుగులోతుకృష్ణ, బోడ గణేష్ పలువురు కోచ్ లు సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు