22 June, 2026 | 2:34 PM

Breaking News

బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ రాజీనామా.. పదేళ్లలో ఆరుగురు!   •   ఉప సర్పంచుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా..   •   శిక్షణా తరగతులు కార్మిక చైతన్యానికి దోహదపడాలి   •   ​ ప్రజా పాలన సినిమా కాదు.. ప్రతిపక్ష పాత్ర సరిగ్గా పోషించండి: మంత్రి సీతక్క   •   డీటీవో వెంకన్న మృతి పట్ల రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి   •   రాజ్‌నాథ్‌ సింగ్‌తో CM రేవంత్ రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ!   •   తరగతి గదుల్లోకి ఉపాధ్యాయుల వాహనాలు.!   •   ఎం.జి.ఎన్.ఆర్.ఈ.జి.ఎస్ నిధులతో రూ.27 లక్షల పనులకు శంకుస్థాపన   •   విద్యార్థుల్లో యోగా ప్రతిరోజు దినచర్య కావాలి   •   సంధ్య థియేటర్ తొక్కిసలాట: కోర్టుకు హాజరుకాని అల్లు అర్జున్   •  

రాక్షసపురం కంటెంట్ ఉన్న చిత్రం

22-04-2026 01:56 AM

కన్నడ చిత్ర పరిశ్రమలో ప్రేక్షకాదరణ పొందిన ‘రాక్షసపుర’ చిత్రాన్ని క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత కేఎస్ రామారావు తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. రవి దర్శకత్వంలో రాజ్ బీ శెట్టి హీరోగా రూపొందిన ఈ సినిమాను తెలుగులో ‘రాక్షసపురం’ పేరుతో మే 1న విడుదల చేయనున్నట్లు మేకర్స్  ప్రకటించారు. ఈ సందర్భంగా జరిగిన ప్రెస్‌మీట్‌లో నిర్మాత కేఎస్ రామారావు సినిమా విశేషాలు పంచుకున్నారు. “ఇది ఒక అద్భుతమైన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్. కన్నడ వెర్షన్ నన్ను ఎంతగానో ఆకట్టుకుంది.

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ కష్టకాలంలో ఉంది. ఐపీఎల్ ప్రభా వం, ఓటీటీల పోటీ వల్ల థియేటర్లకు ప్రేక్షకులు రావడం తగ్గుతోంది. అయినా ‘రాక్షసపురం’ లాంటి మంచి కంటెంట్ ఉన్న సినిమాలు ప్రేక్షకులను కచ్చితంగా థియేటర్లకు రప్పిస్తాయనే నమ్మకం నాకుంది” అని తెలిపారు.