ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా ర్యాలీ
04-03-2026 12:00 AM
వెంకటాపురం(నూగూరు), మార్చి 3(విజయక్రాంతి): ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం పురస్కరించుకొని మంగళవారం మండల కేంద్రంలో అటవీశాఖ ఆధ్వర్యంలో ర్యాలీని అడవి సిబ్బంది నిర్వహించారు. ఈ సందర్భంగా అటవీ సిబ్బంది వన్యప్రాణి సంరక్షణ గురించి నినాదాలు చేస్తూ ప్రదర్శన జరిపారు. ఈ కార్యక్రమంలో ఎఫ్డిఓ గ్వాలియా, ఎఫ్ ఆర్ వో లు వంశీకృష్ణ, బాలకృష్ణ, వెంకటాపురం ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ గుగులోతు దేవయ్య, అటవీ సిబ్బంది పాల్గొన్నారు.




