ప్రకృతి ఒడిలో ఆధ్యాత్మికత
నేటి నుండి గుంజేడు ముసలమ్మ జాతర
మహబూబాబాద్ మార్చి3 (విజయక్రాంతి): దట్టమైన అటవీ ప్రాంతం.. ప్రకృతి ఒడిలో పరవశించే ఆధ్యాత్మిక కేంద్రం గుం జేడు. ఇక్కడ కొలువైన శ్రీ ముసలమ్మ దేవత భక్తుల పాలిట కల్పవల్లిగా విరాజిల్లుతోంది. రెండేళ్లకోసారి జరిగే ఈ వనదేవత జాతర మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండ లం గుంజేడు లో నేడు అత్యంత వైభవంగా ప్రారంభంకానుంది. నాడు ఆదివాసీల ఇలవేల్పుగా వెలసి..
నేడు అందరి మొక్కులు తీర్చే దేవతగా కొలువు దీరిన మహిమగల తల్లి శ్రీముసలమ్మ దేవత భక్తులు కోరిన కో ర్కెలు తీర్చి నిత్యం మొక్కులు పొందుతోంది. మహా జాతరకు దేవాదాయ శాఖ అన్ని ఏ ర్పాట్లు పూర్తి చేసింది. మార్చి 4 నుంచి 6వ తేదీ వరకు నిర్వహిస్తున్న ఈ జాతర కు ఉమ్మడి వరంగల్ జిల్లా, భద్రాద్రి కొత్తగూ డెం, ఖమ్మం తదితర ప్రాంతాల నుండి భారీగా భక్తులు తరలిరానున్నారు.
స్థల పురాణం
జీవనోపాది కోసం చత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని బస్తర్ జిల్లా నుంచి తల్లిదండ్రులతో క లిసి వచ్చిన శ్రీముసలమ్మ, తన చెల్లెలు ము త్యాలమ్మ గోదావరి దాటి తమకు అనువైన ప్రాంతం కోసం వెతుకుంటూ వస్తున్న క్ర మంలో గుంజేడు ప్రాంతానికి రాగానే దో పిడి దొంగలు వారి నుంచి ధనం, బంగారు దోచుకునేందుకు వెంటపడ్డారు. వారితో శ్రీముసలమ్మ, ముత్యాలమ్మ విరోచితంగా పోరాడుతున్న సమయంలో ముత్యాలమ్మ వీరమరణం పొందగా, శ్రీమునలమ్మ దో పిడీ దొంగల నుంచి తప్పించుకునే క్ర మంలో గుంజేడు ప్రాంతంలోని గుట్టలోకి వెళుతుంది.
చాలాకాలం తరువాత తోలెం వంశీయుల కలలో కనిపించి నేను గుట్టలో కొలువై ఉన్నాను. నన్ను కొలిస్తే మీ కోరికలు తీరుస్తాను.. మీకు సుఖ, సంతోషాలు అందిస్తానుని చెబుతుంది. మరుసటి రోజు వారు వెళ్లి వెతకగా కుంకుమ భరిణి రూపంలో అ మ్మవారు కనిపించారు. కుంకుమ భరణను తీసుకువచ్చి అప్పటి నుంచి గుంజేడు వాగు సమీవంలో ప్రతిష్ఠించి పూజలు చేస్తున్నారు. ఆనాటి నుండి నేటి వరకు శ్రీముసలమ్మ దేవత మహిమలు ఇతర ప్రాంతాలకు వ్యా పించడంతో అన్ని వర్గాల భక్తులు అధిక సం ఖ్యలో తరలివచ్చి శ్రీముసలమ్మ దేవతను కొలుస్తున్నారు.
ఈ దేవాలయానికి తోలెం వంశీయులే పూజారులుగా ఉంటున్నారు. ఆలయం పక్కనే శ్రీముసలమ్మ చెల్లెలు ముత్యాలమ్మ తల్లి గుడిని ఏర్పాటు చేశారు. దేవాలయం సమీపంలో ప్రవహించే వాగు నీటిని తీసుకువెళ్లి పొలాలల్లో చల్లుకుంటే పంట మంచి దిగుబడి వస్తుందని చెబుతుంటారు. కొత్తగూడా ఏజెన్సీ కావడంతో చు ట్టూ దట్టమైన అడవి, పక్కనే సెలయేరు... పారుతుంటే చూడటానికి ఆహ్లాదాన్ని అంది స్తూ ఆ దేవత తన్మయత్వంలో మునిగిపోతూ ఆధ్యాత్మికతను ప్రతిబింబించే విధం గా గుంజేడు ముసలమ్మ దేవాలయం నిలుస్తోంది.
జాతర విశేషాలు
శ్రీముసలమ్మ జాతర సందర్భంగా గుం జేడు గ్రామంలో మట్టి ఇళ్లను అలికి రం గులు వేసుకుని ముగ్గులు వేసుకుని ము స్తాబు చేసుకుంటారు. మొదటి రోజు సాయంత్రం గుంజేడు గ్రామస్థులు ముత్యాలమ్మ దేవతకు బోనాలు సమర్పిస్తారు. గురువారం పడిగలతో గుట్టకు వెళ్లి శ్రీముసలమ్మ దేవతను తీసుకువచ్చి గుడిలో ప్రతిష్ఠిస్తారు. శుక్రవారం భక్తులు శ్రీముసలమ్మను దర్శించుకుంటారు.
ముసలమ్మ దేవ తను దర్శించుకుంటే కోరిన కోర్కెలు తీరుతాయని ప్రగాఢ నమ్మకం, మరి ముఖ్యంగా సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుందని భక్తుల విశ్వాసం. భక్తులు అమ్మవారికి ఒడి బియ్యం పోసి, పసుపు, కుంకుమలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. మేడారం తరహాలోనే ఇక్కడ కూడా బెల్లాన్ని (బంగారం) నైవేద్యంగా సమర్పిస్తారు. అలాగే తాము పండించిన పం టను కూడా నైవేద్యంగా ఇవ్వడం విశేషం. ఆ సాయంత్రమే శ్రీముసలమ్మ దేవత వనప్రవేశంతో జాతర ముగుస్తుంది.
అందంగా ముస్తాబైన దేవాలయం
దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో గుడి ప్రా కారానికి రంగులు వేయించారు. విగ్రహాలకు రంగువేసి ముస్తాబు చేశారు. భక్తులకు తాగునీరు, విద్యుత్తు సౌకర్యాలు ఏర్పాటు చేశారు. అధిక సంఖ్యలో తరలివచ్చి శ్రీములసమ్మ దేవతను దర్శించుకోవాలని ఉత్సవ కమిటీ చైర్మన్ భూర్క సరేందర్, ఈవో అనిల్, పూజారులు తోలెం చిన్న నర్సయ్య, వెంకటేశ్వర్లు, తోలెం వెంకన్న. కిరణ్ కుమార్, తోలెం నవీన్, తోలెం రాంబాబు, స్థానిక సర్పంచ్ తోలెం అనంతరావు కోరారు.




