18 April, 2026 | 4:46 PM

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఘనంగా ర్యాలీ నిర్వహణ

05-06-2025 07:53 PM

ప్లాస్టిక్ ని నిషేధించి, పర్యావరణ పరిరక్షణకు సమాజంలోని ప్రతి ఒక్కరు కృషి చేయాలి..

జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్.గోపాలరావు..

ములుగు (విజయక్రాంతి): కుటుంబ సంక్షేమ, మిషన్ డైరెక్టర్ ఎన్హెచ్ఎం కమిషనర్ హైదరాబాద్ ఆదేశానుసారం ప్రపంచ పర్యావరణ దినోత్సవ(World Environment Day) ర్యాలీని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్.గోపాలరావు(District Medical and Health Officer Dr. Gopal Rao) ప్రారంభించారు అనంతరం అయనా మాట్లాడుతూ... ప్లాస్టిక్ ని నిషేధించి, పర్యావరణ పరిరక్షణకు సమాజంలోని ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ప్లాస్టిక్ కాలుష్యాన్ని నివారించండి అనే థీమ్ తో పనిచేయాలని, ఉత్సవాలు, పెండ్లిలు జరిగినప్పుడు ప్లాస్టిక్ గ్లాసులను ప్లాస్టిక్ ప్లేట్లను వాడకూడదని వివరించారు. వాహనాలలో రెండు గుడ్డ సంచులను నిల్వ పంచుకోవాలని మార్కెట్కు వెళ్ళినప్పుడు కూరగాయలను తీసుకువచ్చేటప్పుడు ఇంటి వద్ద నుండే తీసుకెళ్లిన సంచులను ఉపయోగించాలని తెలిపారు. ఇంటిలోని చెత్తను ప్లాస్టిక్ కవర్లో వేసి చెత్తతో పాటు కుండిలో వేయకూడదని అలా వేస్తే ఆ చిత్తతోపాటు ప్లాస్టిక్ సంచులను కూడా ఆవులు గేదెలు తిని ప్రాణాలను కోల్పోయే అవకాశాలు ఉన్నాయని వివరించారు.

ర్యాలీ తర్వాత డిఎంహెచ్ఓ కార్యాలయం ముందు పర్యావరణ దినోత్సవ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ గోపాలరావు మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్. శ్రీకాంత్, రాయినిగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్. నాగన్వేష్, డిపిహెచ్ఎన్ శకుంతల, కోఆర్డినేటర్ భూపాల్ రెడ్డి, ప్రోగ్రాం మానిటరింగ్ సూపర్వైజర్ సురేష్ బాబు, పిహెచ్ఎన్ శోభ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సూపర్వైజర్స్ ఆరోగ్య కార్యకర్తలు ఆశా కార్యకర్తలు, డిఎంహెచ్ఓ ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు.