05-06-2025 07:49:44 PM
ప్రమాదాల నివారణకు వాహానదారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి..
ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ, సీఐ అనుముల శ్రీనివాస్, ఎస్సై తాజుద్దిన్..
ఏటూరునాగారం (విజయక్రాంతి): ఏటూరునాగారం మండల కేంద్రంలోని ఆకులవారి ఘనపురం, ఎక్కల అటాచ్ 163వ జాతీయ రహదారి రోడ్డు ప్రమాదకారంగా మారింది. ఇక్కడ తరచూ ప్రమాదాలు జరుగుతున్నయి. ఈ సమస్య పరిష్కారం చేయడం కోసం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్(District SP Dr. Shabarish) ఏటూరునాగారం ఏఎస్పీ శివం(ASP Shivam) ఉపాధ్యాయ ఆదేశాల మేరకు ఏటూరునాగారం సీఐ అనుముల శ్రీనివాస్ సూచనల మేరకు గురువారం స్థానిక ఎస్ఐ తాజుద్దీన్ ఆధ్వర్యంలో గ్రామస్తుల సహకారంతో రోడ్డు మరమ్మత్తు పనులు చేపట్టడం జరిగింది.
ఈ సందర్భంగా పోలీస్ శాఖ వారు మాట్లాడుతూ... మన సమాజంలో రహదారులు అనేవి ప్రధాన రవాణా మార్గాలు వీటి ద్వారా ప్రజలు, వస్తువులు ఒక చోటినుంచి మరొక చోటికి సురక్షితంగా ప్రయాణిస్తారు. అయితే రోడ్లు దెబ్బతినడం సహజం వాటికి మరమ్మత్తులు అవసరం అవుతాయి కానీ ఈ రోడ్డు మరమ్మత్తులు సక్రమంగా చేయకపోతే,అవే ప్రాణాంతక ప్రమాదాలకు దారితీస్తాయి.
నివారణ చర్యలు:
హెచ్చరిక బోర్డులు & కంకాలు ఏర్పాటు చేయాలి.
ప్రతి మరమ్మత్తు ప్రాంతంలో స్పష్టమైన సూచనలు ఉండాలి. చక్కటి లైటింగ్ ఏర్పాటు చేయాలి.
రాత్రివేళల్లో రహదారి కనిపించేలా తాత్కాలిక దీపాలు వేసే ఏర్పాటు చేయాలి.
ప్రజలకు ముందస్తు సమాచారం ఇవ్వాలి. రోడ్డు పనులు ఎక్కడ జరుగుతున్నాయి, దారి మళ్లింపు ఎక్కడ ఉందో ప్రజలకు తెలియజేయాలి.
త్వరితంగా పనులు పూర్తిచేయాలి.
రహదారులు ఎక్కువ రోజులు మూసివేయకుండానే పనులు పూర్తిచేయాలి.
సాంకేతిక నిపుణుల పర్యవేక్షణ:
ఇంజినీర్లు, అధికారులు పనులను నాణ్యతతో భద్రతతో నిర్వహించాలి. రోడ్డు మరమ్మత్తులు అవసరం అయినప్పటికీ, అవి జాగ్రత్తగా, సమయపాలనతో ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని చేయాలి. చిన్న తప్పిదం ఒక పెద్ద ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. అందుకే "రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత" అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు.
రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు తీసుకోవాల్సిన ప్రధాన చర్యలు:
ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని స్పీడ్ లిమిట్‌ను పాటించడం ట్రాఫిక్ సిగ్నల్స్‌కు గౌరవించడం ఓవర్‌టేకింగ్ సమయంలో జాగ్రత్తలు పాటించడం మద్యం సేవించి వాహనం నడపకూడదు మద్యం సేవించిన తరువాత డ్రైవింగ్ చేయడం ప్రమాదకరం ఇది కఠినంగా నిషేధించాలి. సురక్షితంగా వాహనాలను నడపడం హెల్మెట్, సీట్ బెల్ట్ వాడటం మొబైల్ ఫోన్ వాడకుండా డ్రైవింగ్ చేయడం వాహనంలో మితిమీరిన స్పీడ్‌కు దూరంగా ఉండటం.
వాహనాల పరిశీలన:
బ్రేకులు, లైట్లు, టైర్లు, సిగ్నల్స్ తదితరాలు సక్రమంగా పనిచేస్తున్నాయా అన్నది తరచూ పరిశీలించాలి. రోడ్డు పరిస్థితులపై అవగాహన మరమ్మతులు జరుగుతున్న ప్రాంతాల్లో ముందుగానే హెచ్చరికలు ఏర్పాటు చేయాలి మచ్చలేని, సరిగ్గా కనిపించే రోడ్డు మార్కింగ్‌లు ఉంచాలి ప్రజల్లో అవగాహన కల్పించాలి స్కూల్‌లు, కాలేజీలు, డ్రైవింగ్ స్కూల్‌లలో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి రోడ్డు భద్రతపై ప్రచార కార్యక్రమాలు చేపట్టాలి.
పోలీసుల పటిష్ట తనిఖీలు:
స్పీడ్ గనర్లు, సీసీ కెమెరాలు వినియోగించడం నియమాలు అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం అత్యవసర సేవలు మెరుగుపరచడం ప్రమాదం జరిగినప్పుడు వెంటనే సహాయం అందేలా 108, పోలీస్ మొదలైన నెంబర్లను అందుబాటులో ఉంచాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.