7 March, 2026 | 1:00 PM

అచ్చియమ్మా.. లుక్ అదిరిందమ్మా!

07-03-2026 12:00 AM

స్టార్ హీరో రామ్‌చరణ్ నటిస్తున్న యాక్షన్ డ్రామా ‘పెద్ది’. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వేంకట సతీశ్ కిలారు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ పనులు, ప్రమోషనల్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రంలో రామ్‌చరణ్ సరసన హీరో యిన్‌గా జాన్వీకపూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ బ్యూటీ ఈ సినిమాలో ‘అచ్చియమ్మ’ అనే పల్లెటూరి అమ్మాయి పాత్రలో అలరించనున్న విషయమూ విదితమే.

శుక్రవారం ఈ అమ్మడి పుట్టినరోజు. ఈ సంద ర్భంగా మేకర్స్.. ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సినిమా నుంచి ఒక ప్రత్యేక పోస్టర్‌ను, మరో వీడియోను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో జాన్వీ సంప్రదాయ శైలిలో కనిపిస్తూనే గ్లామరస్ లుక్‌లో ఆకట్టుకుంటోంది. ఇక స్పెషల్ బర్త్‌డే ట్రిబ్యూట్ వీడియోలో జాన్వీ.. ఆన్‌స్క్రీన్, ఆఫ్‌స్క్రీన్ చార్మ్‌ను చూపించే బీహైండ్ ది సీన్స్ మూమెంట్స్ ఉన్నాయి. శివరాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు, బోమన్ ఇరానీ ముఖ్య పాత్రలను పోషిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చుతున్నారు. ఆర్ రత్నవేలు సినిమాటోగ్రాఫర్ కాగా, ఎడిటర్‌గా నవీన్ నూలి, ప్రొడక్షన్ డిజైనర్‌గా అవినాష్ కొల్లా పనిచేస్తున్నారు.