4 May, 2026 | 3:12 PM

Breaking News

కేరళం హస్తగతం.. యూడీఎఫ్ ఆధిక్యం   •   మాది రైతు ప్రభుత్వం భరోసా లేని రైతు జీవితానికి భరోసా కల్పిస్తాం: విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్   •   ఇంకా ఓడిపోయినట్లు కాదు.. ఎన్నికల ఫలితాలపై మమతా బెనర్జీ స్పందన   •   ప్లాస్టిక్ గ్లాస్లో చాయ్ తాగితే 3,000 జరిమానా   •   కాంగ్రెస్ పార్టీ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మారం రెడ్డి కౌటిల్ రెడ్డి   •   రైతు వేదికల్లో రైతులకు అవగాహన సదస్సులు   •   కాంగ్రెస్ పార్టీలో మైనారిటీలకు ప్రాధాన్యత లేదు: ఎండీ ఖాజా భక్ష్   •   అగ్ని ప్రమాదంలో 44 లక్షల పంట నష్టం 47 ఎకరాల్లో దగ్ధం   •   అకాల వర్షాలతో కొమరారం కేంద్రంలో తడిసిన మొక్కజొన్న   •   మొక్కజొన్నకు అగ్ని ప్రమాదాలు   •  

జూలై 26న రామ్ ఎన్‌ఆర్‌ఐ

23-07-2024 12:05 AM

బిగ్‌బాస్ ఫేమ్ అలీ రజా కథానాయకుడిగా, సీతా నారాయణన్ కథానాయికగా నటించిన చిత్రం ‘రామ్ ఎన్‌ఆర్‌ఐ’. ‘పవర్ ఆఫ్ రిలేషన్ షిప్’ అనేది ఉపశీర్షిక. ఈ చిత్రానికి ఎన్.లక్ష్మీ నందా దర్శకుడు. ఎస్‌ఎంకే ఫిల్మ్స్ సింగులూరి మోహన్‌కృష్ణ సమర్పణలో మువ్వా క్రియేషన్స్ పతాకంపై మువ్వా సత్యనారాయణ నిర్మించిన ఈ చిత్రం జూలై 26న విడుదల కానుంది. ఈ క్రమంలో ఆదివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించిన చిత్ర బృందం ఇదే కార్యక్రమంలో సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా సమర్పకులు సింగులూరి మోహన్‌కృష్ణ మాట్లాడుతూ “సినిమా అద్భుతంగా వచ్చింది.

ఉయ్యాల జంపాల, శతమానంభవతి ఫ్లేవర్ నాకు కనిపించింది. చిన్న చిత్రాలకు ప్రాధాన్యతనిస్తూ మా బ్యానర్ మీద ఏడాదికి ఆరు చిత్రాలైనా రిలీజ్ చేయాలని అనుకుంటున్నాను. లక్ష్మీ నందా గారితో ఓ సోలో చిత్రాన్ని చేస్తున్నాను” అని చెప్పారు.‘ఈ మూవీ పెద్ద సక్సెస్ అవుతుందని భావిస్తున్నామ’ని  నిర్మాత మువ్వా సత్యనారాయణ అన్నారు. అతిథులుగా ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతాని రామకృష్ణ గౌడ్, లయన్ సాయి వెంకట్, ప్రసన్న కుమార్, రామ సత్యనారాయణ ‘కొత్త వారు కలిసి చేసిన ప్రయత్నం విజయవంతం కావాలని’ ఆకాంక్షించారు.