30 June, 2026 | 11:29 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

రంజాన్ పర్వదినం మత సామరస్యానికి ప్రతీక: ఎస్సై బాబు

16-03-2026 06:59 PM

మఠంపల్లి,(విజయక్రాంతి): మఠంపల్లి మండలం పెదవీడు గ్రామంలో 2వ వార్డ్ నంబర్ సయ్యద్ వహాబ్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి హుమేరా మస్జిద్ లో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మఠంపల్లి ఎస్సై పి.బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్సై ను నాయకులు శాలువాతో ఘనంగా సన్మానించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ... పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిములు కఠోర దీక్షతో ఉపవాసాలు ఉంటారని తెలిపారు. రంజాన్ పర్వదినం మత సామరస్యానికి ప్రతీక అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనారిటీ అధ్యక్షుడు షేక్ కరీం,2వ వార్డ్ నంబర్ సయ్యద్ వహాబ్, గ్రామ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు సయ్యద్ రహీం, రిజ్వాన్, మౌలానా సయ్యద్ షకీల్, షేక్.బాబు, తదితరులు పాల్గొన్నారు.