16 March, 2026 | 8:17 PM

యుద్ధాన్ని నిలిపి.. గ్యాస్ ధరలను అదుపులోకి తీసుకురండి

16-03-2026 06:55 PM

సిపిఐ మేడ్చల్ జిల్లా కార్యవర్గ సభ్యులు టి. శంకర్

జవహర్ నగర్,(విజయక్రాంతి): ఇరాన్ పై ఇజ్రాయిల్... అమెరికా చేస్తున్న యుద్ధాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకొని తక్షణమే నిలిపివేసి గ్యాస్ ధరలను అదుపులోకి తేవాలని సిపిఐ మేడ్చల్ జిల్లా కార్యవర్గ సభ్యులు తోటపల్లి శంకర్ డిమాండ్ చేశారు. యుద్ధంతో గ్యాస్ ధరలు పెరిగాయని నిరసిస్తూ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ అంబేద్కర్ ప్రధాన రహదారిలో సిపిఐ మేడ్చల్ జిల్లా కార్యవర్గ సభ్యులు తోటపల్లి శంకర్ ఆధ్వర్యంలో సోమవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.

ఈ సందర్భంగా తోటపల్లి శంకర్ మాట్లాడుతూ యుద్ధంతో నిత్యవసర వస్తువులు ధరలు పెరిగి నిత్యాసర వస్తువులు ఆకాశాన్ని అంటుతున్నాయని, నిత్యవసర వస్తువులు, గ్యాస్, మార్కెట్లో లభించకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని దుయ్యబట్టారు. యుద్ధం ఇలాగే కొనసాగితే ప్రజల మనుగడ ప్రశ్నార్ధకంగా మారుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నరసింహ, దశరథ, బాబు, జంగయ్య, శ్యామలత, స్వరూప్ నాయక్, వెంకటాచారి, నరసింహ, చిరంజీవి, సంతోష, మల్లికా తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.