తంగళ్ళపల్లిలో రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం
తంగళ్ళపల్లి, మార్చి 19 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని మదీనా మస్జిద్ వద్ద తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో రంజాన్ తోఫా బట్టల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. రంజాన్ పండుగను పురస్కరించుకొని ముస్లిం సోదర సోదరీమణులకు బట్టలను పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మజీద్ కమిటీ అధ్యక్షుడు హైదర్ బాబా, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు టోనీ, తంగళ్ళపల్లి సర్పంచ్ మోర లక్ష్మీరాజ్యం, ఉప సర్పంచ్ ఆసాని శ్రీకాంత్ రెడ్డి, ఏఎంసి వైస్ చైర్మన్ నేరెళ్ల నర్సింగం గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దూరి తిరుపతి, రాపల్లి ఆనందం, ముస్లిం మైనార్టీ మండల అధ్యక్షుడు మొహమ్మద్ హమీద్, ఎండి ఖాసిం, మొహమ్మద్ హమీద్, ఎండి సలీం, ఎండి ఇమామ్, వార్డ్ మెంబర్లు, ముస్లిం మైనార్టీ మహిళలు తదితరులు పాల్గొన్నారు.




