19 March, 2026 | 4:20 PM

సారంపల్లిలో రంజాన్ తోఫా పంపిణీ

19-03-2026 02:59 PM

ముస్లిం సోదరులకు ప్రభుత్వం అందజేసిన కానుకలు

తంగళ్ళపల్లి, మార్చి 19( విజయ క్రాంతి): రంజాన్ పండుగ సందర్భంగా సారంపల్లి గ్రామంలో ముస్లిం సోదర సోదరిమణులకు రాష్ట్ర ప్రభుత్వం అందించే తోఫాలను గ్రామ సర్పంచ్ గుగ్గిళ్ళ లావణ్య - నర్సయ్య గౌడ్, నాయకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ ఎంతో పవిత్రమైనదని, నెలరోజుల పాటు ఉపవాస దీక్షలను భక్తి శ్రద్ధలతో పాటించే వారికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈద్ ముభారక్ కానుకలుగా తోఫాలను అందజేస్తోందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇంచార్జ్ కే కే మహేందర్ రెడ్డి ఆదేశాల మేరకు  రంజాన్ పండుగ తోఫాలను పంపిణీ చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మజీద్ కమిటీ అధ్యక్షుడు ఎండి హనీఫ్, యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు మునిగేలా రాజు, కాంగ్రెస్ పార్టీ మానవ హక్కుల యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు గుగ్గిళ్ళ భరత్ గౌడ్, ఎండి గులాం ఖాదర్, గుగ్గిళ్ళ అభిషేక్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.