రామోజీ రావు సేవలను స్మరించుకున్న కేసీఆర్
08-06-2024 10:56 AM
హైదరాబాద్: తెలుగు న్యూస్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ నెట్‌వర్క్ ఈటీవీ అధినేత, రామోజీ ఫిల్మ్ సిటీ వ్యవస్థాపకుడు చెరుకూరి రామోజీరావు (87) శనివారం ఉదయం హైదరాబాద్‌లో కన్నుమూశారు. రామోజీ రావు మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. పలు రంగాల్లో వ్యాపారవేత్తగా, మీడియా సంస్థల వ్యస్థాపకుడిగా వారందించిన సేవలను కేసీఆర్ స్మరించుకున్నారు. శోక తప్తులైన వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.






