1 August, 2026 | 4:27 PM

Breaking News

ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిద్దాం   •   ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు మరింత మెరుగుపర్చాలి   •   రిఫీలింగ్ సెంటర్లపై దాడి.. 16 గ్యాస్ సిలిండర్లు స్వాధీనం   •   అభివృద్ధి పనులకు ప్రణాళికలు సిద్ధం చేయాలి   •   విద్యార్థులకు అండగా నిలబడడమే 'యూత్ ఫర్ సేవ' లక్ష్యం   •   కోనరావుపేట మండలంలో ఎమ్మార్పీఎస్ నూతన కమిటీల ఏర్పాటు   •   ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని జయప్రదం చేయండి   •   తల్లిపాల వారోత్సవాలు   •   బాచ్‌పన్ ఏహెచ్‌పీఎస్ ప్రైమరీ, బీరంగూడలో ఫ్యాన్సీ డ్రస్ పోటీలు   •   మండల సాధారణ సర్వసభ్య సమావేశంలో సమయపాలన పాటించని సర్పంచులు, అధికారులు   •  

సీఎం కప్ హ్యాండ్‌బాల్ టోర్నమెంట్‌లో రంగారెడ్డి జిల్లా జట్టు ఘన విజయం

25-02-2026 01:07 AM

రూ. లక్ష నగదు బహుమతి

ఘట్ కేసర్, ఫిబ్రవరి 24 (విజయక్రాంతి) : రాష్ట్ర స్థాయి సీఎం కప్ హ్యాండ్బాల్ పోటీలు ఈ నెల 20 నుండి 23 వరకు హైదరాబాద్ లోని లాల్ బహుదూర్ స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. ప్రతిష్టాత్మక పోటీల్లో రంగారెడ్డి జిల్లా జట్టు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుని రూ. ఒక లక్ష నగదు బహుమతిని అందుకుంది.

ఈజట్టులో భాగంగా ఘట్ కేసర్ సర్కిల్ పరిధి అంకుషాపూర్ లోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ హ్యాండ్ బాల్ అకాడమీ మహిళా డిగ్రీ కళాశాల మహేంద్ర హిల్స్కు చెందిన క్రీడాకారిణులు కల్పన, జ్యోతి అద్భుత ప్రదర్శనతో బంగారు పతకాలను సాధించారు.

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ స్నేహలత హర్షం వ్యక్తం చేస్తూ క్రీడాకారిణుల కృషి, పట్టుదల, కోచ్ల సమర్థమైన మార్గదర్శకత్వం వల్లే ఈ విజయం సాధ్యమైందని పేర్కొన్నారు. అనంతరం వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కవిత విజేతలకు పతకాలు, సర్టిఫికెట్లు అందజేశారు.