15 April, 2026 | 6:45 AM

పేదల సంక్షేమం కోసం ఆలోచించే ఏకైక పార్టీ కాంగ్రెస్

25-02-2026 01:08 AM

బీబ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్

ఘట్ కేసర్, ఫిబ్రవరి 24 (విజయక్రాంతి) : నిరు పేదల సంక్షేమం కోసం ఆలోచించే ఏకైక పార్టీ కాంగ్రెస్ అని మేడ్చల్ నియోజకవర్గం బీబ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ అన్నారు. ఇందిరమ్మ ఇండ్లు కార్యక్రమంలో భాగంగా ఘట్ కేసర్ సర్కిల్ పరిధిలోని 6వ డివిజన్ ఘట్ కేసర్ అంబేద్కర్ నగర్ లో, 7వ డివిజన్ ఎదులాబాద్ లో మంగళవారం  లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరి పత్రాల పంపిణి చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా బీబ్లాక్ అధ్యక్షులు మహేష్ గౌడ్ , మున్సిపల్ మాజీ చైర్మన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ హాజరై ఇందిరమ్మ ఇండ్ల మంజూరి పత్రాలను అందజేశారు. ఈ సందర్బంగా మహేష్ గౌడ్ మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో పేదల సంక్షేమం గురించి ఆలోచన చేసేది ఒక్క కాంగ్రెస్ పార్టీ అని పేర్కొన్నారు. 6వ డివిజన్, 7వ డివిజన్ లో అత్యధికంగా ఇండ్లు మంజూరి చేసినందుకు సీఎం ఎనుముల రేవంత్ రెడ్డికి, మంత్రులు  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి,  దుద్దిళ్ల శ్రీధర్ బాబుకి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ కి, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డికి, టిపిసిసి సీనియర్ ఆఫీసియల్ స్పోక్స్ పర్సన్ సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డికి,  కృతజ్ఞతలు తెలిపారు.

కార్యక్రమంలో మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షులు మామిండ్ల ముత్యాల్ యాదవ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బొక్క సంజీవరెడ్డి, మాజీ సర్పంచ్ బద్దం గోపాల్ రెడ్డి, మాజీ ఎంపిటిసి కందుల కుమార్,  మాజీ కౌన్సిలర్ కడపోల్ల మల్లేష్, కీసరగుట్ట ధర్మకర్త సామల అమర్, మాజీ ఉప సర్పంచ్ లు వేముల పరమేష్ గౌడ్, అకిటి సుధాకర్ రెడ్డి, జిల్లా యూత్ కాంగ్రెస్ మాజీ ప్రధాన కార్యదర్శి కవాడి మాధవ్ రెడ్డి,

సీనియర్ నాయకులు ఉల్లి ఆంజనేయులు, ఫారూక్, రహమాన్, డొంకన శంకర్ గౌడ్, కవాడి వామన్ రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గం ఎస్టీ సెల్ అధ్యక్షులు ననావత్ సురేష్ నాయక్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బొక్క సంజీవరెడ్డి, జిల్లా ఎన్ ఎస్ యు ఐ కార్యదర్శి ననావత్ శివాజీ నాయక్, నాయకులు బొక్క సత్తిరెడ్డి, ఇందిరమ్మ కమిటి సభ్యులు, కార్యకర్తలు, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు  పాల్గొన్నారు.