గుంజపడుగు సోలార్ పవర్ ప్లాంట్‌ను పరిశీలించిన రంగారెడ్డి జిల్లా సహకార సంఘాల బృందం
మంథని ఏప్రిల్10 (విజయక్రాంతి): మంథని మండలం గుంజపడుగు గ్రామ శివారులో నాలుగు ఎకరాల విస్తీర్ణంలో రూ .3.20కోట్ల వ్యయంతో పిఎం కుసుమ్ పథ కం ద్వారా ఏర్పాటు చేసిన 1 మెగా వాట్ సోలార్ పవర్ ప్లాంట్ ను శుక్రవారం రంగారెడ్డి జిల్లా సహకార సంఘాల కార్యదర్శుల బృందం పరిశీలించింది.
సోలార్ ప్లాంట్ లో మరో రెండు వారాల్లో విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా శరవేగంగా పనులు చేపడుతున్న ట్లు సంఘ కార్యదర్శి మామిడాల అశోక్ కుమార్ బృందానికి వివరించారు. ఈ పవ ర్ ప్లాంట్ లో రోజుకు 5000 యూనిట్ల వి ద్యుత్ ఉత్పత్తి జరుగనుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం సహకార శా ఖ అసిస్టెంట్ రిజిస్ట్రార్ రవి, మార్కెటింగ్ అధికారి సైదులు, శంషాబాద్ సహకార సం ఘం కార్యదర్శి అర్జున్, ఉప్పరగూడ కార్యదర్శి గణేష్, తుర్కయంజల్ కార్యదర్శి రాం దాసు, బాలానగర్ కార్యదర్శి జై హింద్, మంథని సహకార సంఘ సిబ్బంది దుబ్బాక సదాశివ్, సంగినవేని నరేష్, తదితరులు పాల్గొన్నారు.




