5 June, 2026 | 1:48 AM

100% వరకు భూముల ధరలు పెంపు

05-06-2026 01:04 AM

భూముల రిజిస్ట్రేషన్ ఫీజు పెంచం

  1. ప్రభుత్వానికి రూ.1,400 కోట్ల ఆదాయం  
  2. గ్రామీణ ప్రాంతాల్లో ఎకరాకు రూ.2.75 లక్షలు
  3. మున్సిపల్ కార్పొరేషన్లలో రూ.5 లక్షలు
  4. హెచ్‌ఎండీఏ పరిధిలో రూ.10 లక్షలు..
  5. ఓఆర్‌ఆర్ పరిధిలో రూ.15లక్షలుగా నిర్ణయం 
  6. త్వరలో తహసీల్దార్ల బదిలీలు
  7. మంత్రి పొంగులేటి

హైదరాబాద్, జూన్ 4 (విజయక్రాంతి) : రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువలు 50 నుంచి 100 శాతం వరకు పెంచుతున్నామని, దీంతో ప్రభుత్వానికి రూ.1,400 కోట్ల ఆదా యం సమకూరుతుందని రెవెన్యూ శాఖ మం త్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, ఖాజాగూడ ప్రాం తాలతో పాటు గ్రేటర్ హైదరాబాద్ శివార్లలో భూముల విలువ గణనీయంగా పెరగనుందని మంత్రి చెప్పారు. ప్రస్తుతం భూముల  విలువ మాత్రమే పెంచుతున్నామని, రిజిస్ట్రేషన్ వ్యాల్యూ పెంచడం లేదన్నారు. రిజిస్ట్రేషన్ వ్యాల్యూ పెంచితే భవిష్యత్తులో  మళ్లీ భూసేకరణ చేయాల్సి వచ్చినప్పుడు ప్రభుత్వ ఖజా నాపై భారం పడుతుందని మంత్రి వివరించా రు.

గచ్చిబౌలి తామ్‌లో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ భవన నిర్మాణ పనులను గురువారం ఆయన పరిశీలించారు. అంతకు ముందు సచివాలయంలోని తన ఛాంబర్‌లో మీడియాతో మాట్లాడారు. గ్రామీ ణ ప్రాంతాల్లో వ్యవసాయ భూముల విలువ ఎకరాకు కనీస ధర రూ.2.75 లక్షలుగా నిర్ణయించామని, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధి లో రూ.5 లక్షలు, హెచ్‌ఎండీఏ పరిధిలో రూ.10 లక్ష, ఓఆర్‌ఆర్ పరిధిలో రూ.15 లక్షలుగా నిర్ణయించినట్లు తెలిపారు. సవరించిన భూములు విలువల్లో వ్యత్యాసాలు ఉంటే సమీక్షిస్తామని మంత్రి వెల్లడించారు. సవరించిన భూముల విలువలు, సందేహాలు, ఫిర్యా దుల కోసం టోల్ ఫ్రీ నంబర్ 180059947 88, వాట్సాప్ 8247619983 నంబర్లకు ఫిర్యాదు చేయవచ్చన్నారు. 

రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచే ఆలోచన లేదు

రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచే ఆలోచన ప్రభుత్వానికి లేదని మంత్రి స్పష్టం చేశారు. గత బీఆ ర్‌ఎస్ ప్రభుత్వం 6 శాతం నుంచి 7.5 శాతానికి పెంచింది. ఒక్క శాతం పెంచినా రూ.వేల కోట్ల భారం ప్రజలపై పడుతుందనే ఆలోచన తో నిర్ణయం తీసుకున్నామన్నారు. వాస్తవానికి దగ్గరగా శాస్త్రీయ పద్ధ్దతిలో భూముల విలువలను సవరించామన్నారు. అక్రమాలకు తావు ఇవ్వకూడదన్న ఆలోచనతో సబ్ రిజిస్ట్రార్ల అధికారాలను కుదించామని చెప్పారు.

త్వర లో తహసీల్దార్ల బదిలీలు ఉంటాయన్నారు. ప్రజలకు వేగవంతంగా, పారదర్శక సేవలు అందించాలనే లక్ష్యంతో రెవెన్యూ వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టామన్నా రు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఏసీబీ కేసులకు సంబంధించిన ఫైళ్లను తొక్కిపెట్టారని మంత్రి ఆరోపించారు. కానీ, కాంగ్రెస్ ప్రభు త్వం వచ్చిన మొదటి 3 నెలల్లోనే 3,500 పెం డింగ్ ఫైళ్లను క్లియర్ చేసిందని వెల్లడించారు.   

స్టాంప్స్, రిజిస్ట్రేషన్స్‌లో సంస్కరణలు

ప్రజలకు పారదర్శకమైన, అవినీతిరహిత సేవలు అందించేందుకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖలో విప్లవాత్మక సంస్కరణలు తీసు కొచ్చామని, స్లాట్ బుకింగ్ విధానం ద్వారా సమయాన్ని ఆదా చేయడమే కాకుండా అత్యాధునిక సమీకృత సబ్ రిజిస్ట్రార్ కార్యాల యాలను నిర్మిస్తున్నామని మంత్రి చెప్పారు. మొదటి దశలో ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో 39 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను, 13 క్లస్టర్లుగా విభజించి ప్రభుత్వంపై ఆర్థికభారం పడకుండా ప్రైవేటు నిర్మాణ రంగ సంస్థలతో నిర్మిస్తున్నామన్నారు. నిర్మాణంతో పాటు ఐదు సంవత్సరాల నిర్వహణ బాధ్యతలను కూడా ఆ సంస్థలకే అప్పగించాం.

మూడు నుంచి ఐదు ఎకరాల స్థలంలో కార్యాలయాల ను ఏర్పాటుచేస్తున్నామన్నారు. ఒకటి, రెండు రోజుల్లో కోహెడలో కూడా ఇంటిగ్రేటెడ్ భవానానికి శంకుస్థాపన చేస్తామన్నారు. రెండో విడతలో జిల్లా కేంద్రాల్లో ఇంటిగ్రేటెడ్ భవనాలను నిర్మిస్తామన్నారు. నిరుపేదల సొంతింటి కల సాకారం చేసే అవకాశం నాకు దక్కిందని,  ఇది చాలా తృప్తినిచ్చిందని పేర్కొన్నారు.  

నేను ఏ తప్పూ చేయలేదు, చేయను

తాను సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని. దేవుడి దయతో ఇంతవరకు వచ్చాను. నాకు ఏ శాఖ ఇచ్చినా మనస్ఫూర్తిగా పని చేస్తానన్నాని మంత్రి పొంగులేటి అన్నారు. తాను ఏ తప్పు చేయలేదని, తప్పు చేసే వ్యక్తిని కాననన్నారు. ఏ ఫైల్‌పై గుడ్డిగా సంతకం పెట్టలేదని, చట్ట ప్రకారం పని చేస్తున్నానని వివరించారు. 

రెవెన్యూ శాఖలో అక్రమాలకు పాల్పడ్డ వారిపై, ఏసీబీ ట్రాప్ అయిన వారిపై గత ప్రభుత్వంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. తాను రెవెన్యూ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 3,500 ఫైళ్లను క్లియర్ చేశానని చెప్పారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు తనపై ప్రేమ ఎక్కువని, అందుకే అప్పుడప్పుడు హగ్గింగ్ చేస్తుంటారని మంత్రి పొంగులేటి సెటైర్ వేశారు.  

ఫ్యూచర్ సిటీ రద్దు సాధ్యం కాదు

అధికారంలోకి రాగానే ఫ్యూచర్ సిటీ’ని రద్దు చేస్తామంటూ బీఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొంగులేటి  స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిబంధనలకు లోబడి పనిచేస్తుందన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఫ్యూచర్ సిటీ రద్దు వంటి వ్యాఖ్యలు చేయ డం సహజమేనని, ఒకవేళ ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తే.. అక్కడ భూములు కొనుగోలు చేసిన వారికి తిరిగి డబ్బులు చెల్లించాల్సి ఉం టుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని మంత్రి హితవు పలికారు. ఫ్యూచర్ సిటీ రద్దు చేయడం సాధ్యమయ్యే పని కాదన్నారు.