సర్వారంలో నాలుగు గడ్డివాములు దగ్ధం
రెండు లక్షల ఆస్తి నష్టం
గరిడేపల్లి,(విజయక్రాంతి): మండల పరిధిలోని సర్వారం గ్రామంలో ప్రమాదవశాత్తు నాలుగు గడ్డివాములు దగ్ధమయ్యాయి. సర్వారం గ్రామంలో పాఠశాల సమీపంలో ఉన్న ఒక గడ్డివాముకు ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి,మధ్యాహ్నం సమయం కావడం,గాలి విపరీతంగా ఉండటంతో అక్కడే ఉన్న మరో మూడు గడ్డివాములకు మంటలు అంటుకున్నాయి. దీంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో గ్రామస్తులు భయాందోళనలకు గురయ్యారు. జరిగిన సంఘటనను ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో హుటాహుటిన సర్వారం గ్రామానికి చేరుకొని అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు లోకి తీసుకొచ్చారు. అప్పటికి గడ్డివాములు పూర్తిగా దగ్ధమయ్యాయి. సుమారు రెండు లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు పేర్కొన్నారు. గ్రామాల్లోని గుమ్మడిల్లి బిక్షం, గుమ్మడి మట్టయ్య, మామిడి మట్టయ్య లకు చెందిన ఈ గడ్డివాములు పూర్తిగా దగ్ధమయ్యాయి.






