20 July, 2026 | 5:46 PM

Breaking News

తాగునీటి సమస్యను పరిష్కరించిన సర్పంచ్   •   ఓటరు జాబితా సవరణ సర్ కార్యక్రమాన్ని విజయవం చేయాలి   •   వారాహి మాత మాలధారణ స్వాములకు అన్నప్రసాద వితరణ   •   శ్రీ ఉమామహేశ్వరం ఆలయ అభివృద్ధికి దాతల చేయూత   •   మున్సిపాలిటీలోనూ ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి   •   సింగరేణి డిస్పెన్సరీని పునఃప్రారంభించిన డైరెక్టర్ (పి&పి) కె. వెంకటేశ్వర్లు   •   ముద్దసాని దామోదర్ రెడ్డి చేసిన సేవలు మరువలేనివి   •   మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •   ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టండి   •   తెలంగాణ రక్షణ సమితిలో చేరిన మండల యువకులు   •  

రాణి ముఖర్జీ మర్దానీ3 వచ్చేది అప్పుడే

22-04-2025 12:10 AM

యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మాణంలో వచ్చిన మర్దానీ ఫ్రాంచైజీ ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ పదేళ్లలో వచ్చిన రెండు సీజన్లకు ఆడియెన్స్ మంచి ఆదరణ లభించింది. భారతదేశంలో అతిపెద్ద, ఏకైక మహిళా కాప్ ఫ్రాంచైజీగా మర్దానీ రికార్డులు క్రియేట్ చేసింది. ‘మర్దానీ3’లోనూ రాణి ముఖర్జీ న్యాయం కోసం నిస్వార్థంగా పోరాడే డేర్ డెవిల్ కాప్ శివానీ శివాజీ రాయ్ పాత్రను తిరిగి పోషించనున్నారు.

ఈ మూడో సీజన్కు సంబంధించిన అప్డేట్ సోమవారం వచ్చింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 27న ‘మర్దానీ3’ రిలీజ్ కానుంది. 2026, మార్చి 4వ తేదీన హోలీ పండుగ సందర్భంగా చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా తమ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు తాజా గా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది.