calender_icon.png 6 May, 2025 | 12:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంబినేషన్స్ చుట్టూ తిరగడం తప్ప కథల గురించి పట్టింపే లేదు!

22-04-2025 12:07:07 AM

ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీదేవీ మూవీస్ పతాకంపై శివలెంక  కృష్ణప్రసాద్ నిర్మాణంలో మోహనకృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించిన చిత్రం ‘సారంగపాణి జాతకం’.  ప్రియదర్శి, రూపా కొడువయూర్ హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా ఏప్రిల్ 25న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నిర్మాత శివలెంక  కృష్ణప్రసాద్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..

‘సారంగపాణి జాతకం’లో అన్ని రకాల అంశాలు ఉంటాయి. ఓ ఫుల్ లెంగ్త్ కామెడీ మూవీ చేయాలనే లోటు ఈ చిత్రంతో తీరిపోయింది. జంధ్యాలతో ఇలాంటి ఓ పూర్తి వినోదాత్మక సినిమా చేయలేదే? అనే లోటు ఇప్పుడు తీరిపోయింది. ఫస్ట్ హాఫ్ పూర్తిగా వినోదాత్మకంగా సాగుతుంది. ఇక ద్వితీయార్ధం నెకట్స్ లెవెల్లో ఉంటుంది. జాతకం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ప్రస్తుతం ఉన్న ట్రెండుకు తగ్గట్టుగా ఈ చిత్రాన్ని మల్చాలని అనుకున్నాం. జంధ్యాల కామెడీ, ఈవీవీ స్టైల్, ఇంద్రగంటి మార్క్ ఇలా అన్నీ ఉండేలా ప్లాన్ చేశాం. 

ఈ కథ విన్నాక దర్శి అయితే బాగుంటుందని మేం అనుకున్నాం. ఇప్పుడు ‘కోర్ట్‘ మూవీ వచ్చి ప్రియదర్శికి మరింత ఇమేజ్ పెరిగింది. కోర్ట్లో ఆయన సీరియస్గా 

కనిపించారు. కానీ ఈ చిత్రంలో అందరినీ గొప్పగా నవ్విస్తారు. ప్రియదర్శి ఈ చిత్రానికి వంద శాతం న్యాయం చేశారు.

సరైన థియేటర్లు దొరకాలనే ఉద్దేశంతో కాస్త లేటుగా వ స్తున్నాం. సమ్మర్ హాలీడేస్ స్టార్ట్ అయ్యాయి. ఇదే మం చి సీజన్ అనుకుని వినోదాన్ని పంచేందుకు మా చిత్రం రాబోతోంది. ఏప్రిల్ 18న సరైన థియేటర్లు దొరకడం లేదనే ఏప్రిల్ 25కి వచ్చాం. ఓవర్సీస్లోనూ 220 థియేటర్లకు పైగానే విడుదల చేస్తున్నాం. 

ఒకప్పుడు మూడు నెలల్లో సినిమా పూర్తయ్యేది. అ ప్పట్లో మేం ఒక హీరోతో చేసిన తరువాత ఇంకో హీరోతో సినిమాను ప్లాన్ చేసేవాళ్లం. కానీ ఇప్పుడు ఒక్కొక్కరు నాలుగైదు ప్రాజెక్టులను లైన్లో పెడుతున్నారు. అంతా కాంబినేషన్స్ చుట్టూ తిరుగుతున్నారు. కానీ కథల గురించి పట్టించుకోవడం లేదు. నాకు సినిమాల పట్ల ఎక్కువ ప్యాషన్ ఉంటుంది.

అందుకే నేను తీసిన ‘ఆదిత్య 369’ అయినా, ‘జెంటిల్‌మెన్’ అయి నా, ‘సమ్మోహనం’ అయినా, ‘యశోద’ అయినా నా మార్క్ కనిపించాలని కోరుకొని తీసిన సినిమాలే. ’సారంగపాణి జాతకం’ ప్రొడక్షన్ వ్యాల్యూస్ గురించి అందరూ గొప్పగా మాట్లాడుకుంటారు. ప్రస్తుతం కొన్ని కథల మీద చర్చిస్తున్నాం. నాకు సీక్వెల్స్ అంటే చాలా భయం. అందుకే వాటికి దూరంగా ఉంటా.

కానీ బాలకృష్ణ మాత్రం ‘ఆదిత్య 369‘ సీక్వెల్ పనులు స్టార్ట్ చేస్తే దానిలో భాగం అవుతా. ‘యశోద‘ డైరెక్టర్లు చెప్పిన రెండు కథలు నాకు చాలా నచ్చాయి. పవన్ సాధినేని చెప్పిన ఓ కథ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. మళ్లీ మోహనకృష్ణ ఇంద్రగంటితో ఇంకో సినిమా చేయబోతున్నా. అన్నీ ఫైనల్ అయ్యాక అన్ని ప్రాజెక్టుల గురించి అధికారికంగా ప్రకటిస్తా.