11-09-2025 12:00:00 AM
-ప్రతిపక్ష హోదా ఇచ్చేది ప్రజలే.. మేం కాదు..
-సూపర్ సిక్స్ హిట్ సభలో ఏపీ సీఎం చంద్రబాబు
-ఆర్థిక ఇబ్బందులున్నా పథకాలు అమలు చేస్తున్నాం: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
హైదరాబాద్, సెప్టెంబర్ 10: నకిలీ రాజకీయాలతో ప్రజలను మోసగించాలని వైసీపీ ప్రయత్ని స్తోందని ఏపీ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం అనంతపురంలో నిర్వహించిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభలో ఆయన ప్రసంగించారు. అసెంబ్లీకి రాకుండా.. రప్పా రప్పా అంటూ రంకెలేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ‘వైసీపీ ఉనికి కోల్పోతోంది. పార్టీ ఆఫీసులు మూసుకొని.. సోషల్ మీడియా ఆఫీసులు తెరిచా రు.
ప్రతిపక్ష హోదాగానీ అసెంబ్లీకి రామంటున్నా రు. ప్రతిపక్ష హోదా ఇచ్చేది నేను కాదు.. ప్రజలు. అసెంబ్లీకి రాని వ్యక్తులు రాజకీయాలు అవసర మా?’ అని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టిన వారి తాట తీస్తామని హెచ్చరించారు. పులివెందుల, ఒంటిమిట్ట ఎన్నికల్లో వైసీపీ బెండు తీశామని, సీమలో 52 సీట్లకు.. 45 సీట్లు కూటమి ప్రభుత్వమే గెలిచిందన్నారు.
హింసారాజకీయాలు చేస్తే.. చట్టం ముందు నిలబెట్టే బాధ్యత తీసుకుంటానని సీబీఎస్ స్పష్టం చేశారు. వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిది ధ్రుతరాష్ర్ట కౌగిలి అని ఆరోపించారు. ఆయనను నమ్మి తే నాశనమేనని విమర్శించారు. ‘ఐదేళ్లలో వైసీపీ చేయలేని పనిని.. 100 రోజుల్లో పూర్తి చేశాం. రాయలసీమ రాళ్ల సీమ కాదు.. రతనాల సీమ. రాయలసీమలో శాశ్వతంగా కరవు నివారిస్తాం. రాష్ట్రాభివృద్ధి కోసం నేను, పవన్ కల్యాణ్ అకుంఠిత దీక్షతో పనిచేస్తున్నాం. మా సంకల్పానికి నరేం ద్రమోదీ అండగా ఉన్నారు’ అని చంద్రబాబు తెలిపారు.
అనంతరం ఏపీ డిప్యూటీ పవన్‌కల్యాణ్ మా ట్లాడుతూ.. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా సూపర్ సిక్స్ అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. రాయలసీమను రతనాల సీమగా మార్చేందుకు చిత్తశు ద్ధితో పనిచేస్తున్నామని చెప్పారు. ‘ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్యబీమా కల్పిం చాం. ఒకేరోజు రికార్డు స్థాయిలో గ్రామసభలు నిర్వహించాం. కోటి మొక్కలు నాటేందుకు శ్రీకారం చుట్టాం. శాంతి భద్రతలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నాం’ అని పేర్కొన్నారు.