11-09-2025 12:00:00 AM
-బకాయిలు ఎగవేతకు యత్నాలు
- డిఫాల్టర్ల కారణంగా ఇతర మిల్లర్లకు ఇబ్బందులు
- కోట్ల సీఎంఆర్ ఎగ్గొట్టేందుకుకుట్ర
కరీంనగర్, సెప్టెంబరు 10 (విజయ క్రాంతి): కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో రైస్ మిల్లర్లు దర్జాగా బకాయిలు ఎగవేసేందుకు తలోరకం దారులు ఎంచుకుంటున్నారు. డి ఫాల్టర్లుగా ఉన్న రైస్ మిల్లర్ల చర్యల వల్ల క్ర మం తప్పకుండా సీఎంఆర్ అందిస్తున్న మి ల్లర్లు ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
డిఫాల్టర్లయిన కొంద రు మిల్లర్లు కోర్టులను ఆశ్రయిస్తుండగా, కొం దరు మిల్లులను మూసివేస్తున్నట్లు చూపి స్తూ అమ్మివేస్తూ బకాయిలకు ఎగనామం పెట్టేందుకు కుట్రలు చేస్తున్నారు. బకాయి ఉన్న సీఎంఆర్ ధాన్యాన్ని క్లియర్ చేయాలని అధికారులు గడువిచ్చినా, తనిఖీలు చేస్తున్నా మిల్లర్లు పట్టించుకోవడం లేదు. కరీంనగర్ జిల్లాలో 133 రైస్ మిల్లులు ఉండగా ఇందులో 22 మిల్లులు డిఫాల్ట్ అయ్యాయి.
వీటి నుండి 126 కోట్ల విలువ చేసే ధాన్యం ప్రభుత్వానికి రావాల్సి ఉంది. ఇందులో ఒక శంకరపట్నం మండలానికి చెందిన ఒక మి ల్లు నుండే దాదాపు 10 కోట్ల మేరకు సీఎంఆర్ ధాన్యం రావాల్సి ఉంది. పెద్దపల్లి జిల్లా తీసుకుంటే మొత్తం 140 రైస్ మిల్లులు ఉం డగా 25 మిల్లుల నుండి 24 వేల టన్నుల సీ ఎంఆర్ ధాన్యం రావాల్సి ఉంది. అయితే డి ఫాల్ట్ అయిన కొన్ని మిల్లులకు కూడా గత రబీలో ధాన్యం కేటాయించడు వివాదానికి దారితీసింది.
ఈ క్రమంలో గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా అధికారులు అప్రమత్తమై డిఫాల్టర్లకు నోటీసులు అందించి రావాల్సిన సీఎంఆర్ ధాన్యాన్ని సే కరించే పనిలో పడ్డారు. నిజానికి కరీంనగర్ జిల్లాలో 60. మిల్లుల వరకు గతంలో డిఫాల్టర్ జాబితాలో ఉండగా ప్రస్తుతం 22 మి ల్లులు మిగిలాయి. ఈ 22లో కూడా చాలామంది ప్రభుత్వానికి కోట్లలో ఎగనామం పె ట్టేందుకు చేయరాని ప్రయత్నాలు చేస్తున్నా రు. పౌరసరఫరాల శాఖ అధికారులు డిఫాల్టర్ల నుంచి రావాల్సిన బకాయిలను వసూ లు చేసేపనిలోపడ్డారు.