14 May, 2026 | 3:27 AM

ఐదేళ్ల చిన్నారికి అరుదైన శస్త్రచికిత్స

14-05-2026 02:27 AM

కిమ్స్ సన్‌షైన్ హాస్పిటల్ వైద్యుల ఘనత

ఐదేళ్లుగా తెరుచుకోని నోటిని శస్త్రచికిత్స ద్వారా తెరుచుకునేలా చేశాం: డాక్టర్ నిశాంత్ సాధనాల

హైదరాబాద్, మే 13 (విజయక్రాంతి): పుట్టిన కొన్ని నెలల నుంచి నోరు పూర్తిగా తెరవలేక, ఐదేళ్ల వయస్సు వచ్చే సరికి నోట్లో ఒక్క వేలు కూడా పట్టని పరిస్థితితో ఆహారం తీసుకోవడంలో ఇబ్బందిపడుతున్న చిన్నారికి కిమ్స్ సన్‌షైన్ హాస్పిటల్ వైద్యులు అరు దైన శస్త్రచికిత్స ద్వారా నోటిని తెరుచుకునేలా చేశారు.

సిద్దిపేటకు చెందిన పి.కరుణా కర్ కుమారుడు పి. యశ్వంత్ ఈ సమస్యతో బాధపడుతూ కిమ్స్ సన్‌షైన్ హాస్పిటల్‌లో కన్సల్టెంట్ ప్లాస్టిక్ అండ్ రీ కన్స్ట్రక్టివ్ సర్జన్ డాక్టర్ నిశాంత్ సాధనాలను కలిశారు. కుడివైపు దవడ ఎదుగుదల ఆగిపోవడంతో సమస్య వచ్చినట్టు వైద్యులు గుర్తించారు.

ఈ పరిస్థితిని ‘టెంపోగోమ్యాండిబ్యులర్ జాయింట్ (టి ఎంఐ) యాంకిలోసిస్‘ అనే వ్యాధి తో బాధపడుతున్నట్లు గుర్తించారు. ఈ సమస్యను యాంకిలోసిస్ రిలీ స్ విత్ కోస్టోకాండ్రల్ గ్రాఫ్ట్ రీకన్స్ట్రక్షన్ శస్త్రచికిత్స చేయాలని డాక్టర్ ని శాంత్ సాధనాల నిర్ణయించారు.

యాంకిలోసిస్ రిలీజ్ సర్జరీతో 1 మిల్లీమీటర్ నుంచి 2 మిల్లీ మీటర్లు మాత్రమే తెరుచుకునే నోటిని 34 మిల్లీ మీటర్లు తెరుచుకునేలా ఓపెన్ చేశారు. ఆగిపోయిన దవడ బోన్ గ్రోతు కొనసాగింపుగా రిబ్ కార్టిలేజ్ను తీసి వేయడం ద్వారా వ యస్సుతో పాటు దవడ ఎముక పెరిగి ము ఖం షేపు కూడా మారకుండా ఉంటుంది. ఈ ఆరుదైన శస్త్రచికిత్సను అయిదు గంటల పాటు నిర్వహించారు. శస్త్రచికిత్స తరువాత బాబు పూర్తి ఆరోగ్యంతో కోలుకున్నాడని హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయినట్లు డాక్టర్ తెలిపారు.