14 May, 2026 | 3:48 AM

ది అల్టిమేట్ సమ్మర్ ఫ్యాషన్

14-05-2026 02:31 AM

రేపటి నుంచి హై లైఫ్ వారి ఎగ్జిబిషన్ 

మూడు రోజుల పాటు నోవొటెల్ హెచ్‌ఐసీసీలో నిర్వహణ

హైదరాబాద్, మే 13 (విజయక్రాంతి): దేశంలోనే అతిపెద్ద ఫ్యాషన్, లైఫ్ స్టైల్ ఎగ్జిబిషన్ బ్రాండ్ అయిన హై-లైఫ్ ఎగ్జిబిషన్ తన సరికొత్త ఎడిషన్ ఎక్స్‌క్యూజిట్ సమ్మర్ ఫ్యాషన్స్ అండ్ వెడ్డింగ్ సీజన్ స్పెషల్‌ను ఈ నెల 15, 16, 17 తేదీల్లో హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో గల హెచ్‌ఐసిసి నోవాటెల్‌లో నిర్వహించనుంది.

మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా సాగే ఈ ప్రదర్శనలో 350 మందికి పైగా ప్రముఖ డిజైనర్లు పాల్గొంటున్నారు. ఇందులో వెడ్డింగ్ స్పెషల్స్, సమ్మర్ ఫ్యాషన్స్, గ్లామర్, స్టైల్, లగ్జరీ, యాక్సెసరీలు, జ్యువెలరీ వంటి మరెన్నో అద్భుతమైన కలెక్షన్లను ప్రదర్శించనున్నారు. రాబోయే వెడ్డింగ్ సీజన్ కోసం క్రియేటివ్ ఫ్యాషన్ వేర్, సమ్మర్ వేర్, ఫ్లోరల్స్, బ్రైడల్ వేర్, వెడ్డింగ్ వేర్, డిజైనర్ వేర్, యాక్సెసరీ లు మరియు జ్యువెలరీ వంటి ప్రత్యేక కలెక్షన్లను ఈ వేడుకలో ప్రదర్శించనున్నారు. దే శంలోనే ఈ తరహా ప్రదర్శనలలో అతిపెద్దదిగా గుర్తింపు పొందిన హై-లైఫ్ ఎగ్జిబిషన్, అగ్రశ్రేణి ఫ్యాషన్ బ్రాండ్లు, ప్రముఖ డిజైన ర్లు, కళాత్మక కలెక్షన్లకు వేదికగా నిలుస్తుంది.