23 July, 2026 | 5:08 PM

నీట్ పేపర్ లీకేజీతో విద్యార్థుల భవితవ్యం అగమ్యగోచరం

23-07-2026 03:58 PM

బోథ్. జులై 23 (విజయక్రాంతి): నీట్ పేపర్ లీకేజీ తో దేశంలో 22 లక్షల 8 వేల మంది విద్యార్థులు ఆందోళన గురవుతున్నారని వారి భవితవ్యం పైన ఆందోళన చెందుతున్నారని సోనాల మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ గాజుల పోతన్న పేర్కొన్నారు. గురువారం అంతర్రాష్ట్ర రహదారి పైన రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తప్పిదాల వల్ల కేంద్ర విద్యాశాఖ మంత్రి అసమర్థత తోనే పేపర్ లీక్ చేయడం జరిగిందని విమర్శించారు.

కోచింగ్ సెంటర్లకు అమ్ముకోవడం జరిగినందున ఈ దుస్థితి నెలకొంది అన్నారు. లీకేజీ కారకులైన వారు వెంటనే గద్దె దిగాలని డిమాండ్ చేశారు.బిజెపి ప్రభుత్వంపదేళ్ల కాలంలో అక్రమాలకు తెరలేతుందన్నారు. విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటున్న ప్రభుత్వంపై సమయం వచ్చినప్పుడు విద్యార్థులు తమ సత్తార్ అన్నారు. కార్యక్రమంలో ఎఎంసి డైరెక్టర్ జంగాల భోజన్న మునేశ్వర్ సోమన్న నియోజకవర్గ యూత్ ఉపాధ్యక్షులు గుడాల అనీష్ ఆప్షన్ సభ్యులు మహమూద్ ఆత్మ డైరెక్టర్ శ్రీధర్ ముండే పలువురు నాయకులు పాల్గొన్నారు.