SIRపై సమీక్ష
23-07-2026 03:55 PM
బోథ్, జులై 23 (విజయక్రాంతి): ఎస్ ఐ ఆర్ కార్యక్రమం పై గురువారం స్థానిక తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ సుభాష్ చంద్ర ఆధ్వర్యంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పార్టీ కన్వీనర్ మెరుగు భోజన్న, ఆత్మ చైర్మన్ రాజు యాదవ్, మాజీ ఏఎంసీ చైర్మన్ బొడ్డు గంగారెడ్డి, బిఎల్ఎ సూపర్వైజర్లు ఎస్కే మహమ్మద్, షేక్ అబుద్ ,అచ్చితానంద రెడ్డి, రహీముద్దీన్ లతో సమావేశమై నియోజకవర్గంలో కొనసాగుతున్న ఎస్ ఐ ఆర్ ప్రక్రియ పైన సమీక్షించారు.ఈ సందర్భంగా తాసిల్దార్ మాట్లాడుతూ నేటితో 100% పూర్తవుతుందని పేర్కొన్నారు.తెలంగాణ రాష్ట్రంలో ఐదవ స్థానంలో కొనసాగడం ఆనందంగా ఉందన్నారు .ఈ విజయానికి సహకరించిన బిఎల్ఎ లకు ప్రజా ప్రతినిధులకు బిఎల్ఓ లకు అభినందనలు తెలిపారు.






