calender_icon.png 13 September, 2024 | 1:52 AM

తినే చట్నీ పాత్రలో ఎలుక

09-07-2024 11:08:10 AM

సంగారెడ్డి : తినే చట్నీ పాత్రలో ఎలుక పడిన ఘటన సంగారెడ్డి జిల్లా సుల్తాన్ పూర్ జేఎన్డీయూ ఇంజనీరింగ్ కళాశాల క్యాంటీన్ లో మంగళవారం చోటు చేసుకుంది. మూత పెట్టకపోవడంతో చట్నీ గిన్నెలో ఎలుక పడినట్లు కళాశాల విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చట్నీలో ఎలుక ఘటనపై జేఎన్టీయూ కళాశాల ప్రిన్సిపల్ స్పందన స్పందించారు.

తినేందుకు తయారు చేసిన చట్నీలో ఎలుక పడలేదని  ప్రిన్సిపల్ అన్నారు. శుభ్రం చేసేందుకు ఉంచిన పాత్రలో ఎలుక పడిందని, పాత్రలో ఉన్న ఎలుకను వీడియో తీసి వైరల్ చేశారని ఆమె పేర్కొన్నారు. కొందరు విద్యార్థులు కావాలనే వీడియో తీసి ప్రజాప్రతినిధులకు పంపినట్లు ప్రిన్సిపల్ స్పందన స్పష్టం చేశారు.