15 May, 2026 | 3:05 PM

Breaking News

రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కలిసిన కాంగ్రెస్ నేతలు   •   మంత్రి తుమ్మలను కలిసిన కల్లూరు, సత్తుపల్లి ఆర్యవైశ్య నాయకులు   •   సత్తుపల్లిలో నల్లమోతు శ్రీనివాస రావు కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి తుమ్మల   •   తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం.. కమిటీ ఏర్పాటు   •   Fuel Price Hike: ‘మోదీ తప్పుకు ప్రజలు మూల్యం చెల్లిస్తున్నారు’: కేంద్రంపై రాహుల్ విమర్శలు   •   ఫిల్మ్ ఛాంబర్‌లో కీలక సమావేశం   •   ఐదు దేశాల పర్యటనకు బయల్దేరిన ప్రధాని మోదీ   •   చెరువులు వాగుల వద్ద జాగ్రత్తగా ఉండండి   •   నేరాల నియంత్రణకు అందరూ సహకరించాలి: సీఐ ధనుంజయ్ గౌడ్   •   ఇక OMR పత్రాలు ఉండవు: ఆన్‌లైన్‌లోనే NEET పరీక్ష   •  

ఘనంగా రథసప్తమి వేడుకలు

05-02-2025 12:41 AM

నిజామాబాద్, ఫిబ్రవరి 4 (విజయ క్రాంతి) : రథసప్తమి వేడుకలను మంగళ వారం వైభవంగా నిర్వహించారు. రథసప్తమి ఉత్సవాలలో భాగంగా నిజామాబాద్ నగరంలోని ప్రముఖ నీలకంఠేశ్వరాలయం భక్తులతో కిటకిటలాడింది. ప్రతి ఏడు రథసప్తమి సందర్భంగా జరిగే జాతర ఉత్సవాలలో నిజామాబాద్ జిల్లా ప్రజలే కాకుండా మహారాష్ట్ర కర్ణాటక నుంచి ఆల యానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు.

మంగళవారం రోజు రథసప్తమి సందర్భంగా ఉదయం నుంచి ఆలయం వద్ద భక్తులు బారులు తీరారు. శ్రీ నీలకంటేశ్వరా లయంలో స్వామి వారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు.  పండితులు స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అలాగే సాయంత్రం శ్రీ నీలకంటేశ్వర స్వామి వారి పూజ కార్యక్రమం అనంతరం   నిర్వహించనున్న రథయాత్ర నిర్వహించారు. ఇటీవల స్వామి వారికి ఏర్పాటు చేసిన నూతన రథాన్ని పూలతో అలంకరణ చేశారు. అనంతరం స్వామివారి రథ ఊరేగింపు భక్తి పరవశంతో భక్తులు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు.