ఫిల్మ్ ఛాంబర్‌లో కీలక సమావేశం
హైదరాబాద్: తెలుగు ఫిల్మ్ ఛాంబర్(Telugu Film Chamber) కీలక సమావేశం జరుగుతోంది. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్(Telugu Film Chamber of Commerce) అధ్యక్షుడు డి సురేష్ బాబు ఆధ్వర్యంలో సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశానికి నిర్మాతలు అల్లు అరవింద్, చదలవాడ శ్రీనివాస రావు, సుప్రియ యార్లగడ్డ, రవి కిషోర్, మైత్రీ రవి, మైత్రీ చెర్రీ, సి కళ్యాణ్, స్రవంతి రవి కిషోర్, దిల్ రాజు, రాధా మోహన్, చెరుకూరి సుధాకర్, భోగవల్లి బాపినీడు, సాహు గారపాటి, సతీష్ కిలారు, నాగవంశీ, ఎస్ కె ఎన్, రాజేష్ దండా, ధీరజ్ మొగిలినేని దాదాపు 50 మంది నిర్మాతలు పాల్గొన్నారు. ఎగ్జిబిటర్స్ తరఫున విజయేందర్ రెడ్డి, శ్రీధర్ తదితరులు హాజరయ్యారు. తెలుగు చిత్రపరిశ్రమలో నెలకొన్న సమస్యలు, ఎగ్జిబిటర్ల పర్సెంటేజీ విధానం, ఇతర సమస్యలపై ఫిల్మ్ ఛాంబర్ చర్చిస్తోంది.






