8 April, 2026 | 2:16 AM

రేషన్ బియ్యం పట్టివేత

08-04-2026 12:28 AM

26 క్వింటాళ్లు స్వాధీనం

నిందితుడి అరెస్ట్

ఎల్బీనగర్, ఏప్రిల్ 7 : పేదల కోసం ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా.. నాగోల్ పోలీసులు పట్టుకున్నారు. 26 క్వింటాళ్ల బియ్యా న్ని స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు. సీఐ మహమ్మద్ మక్బూల్ జానీ వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా తుర్కపల్లి మండలం పెన్పహాడ్ గ్రామానికి చెంది న రవి నాయక్ టాటా ఏస్ వాహనంలో రేషన్ బియ్యాన్ని శంషాబాద్ ప్రాం తానికి అక్రమంగా తరలిస్తున్నాడు.

మంగళవారం నాగోల్ చౌరస్తా వద్ద ఎస్త్స్ర రమేశ్ ఆధ్వర్యంలో నిర్వహించిన వాహన తనిఖీలలో అనుమానం రావడంతో వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా భారీ మొత్తంలో రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. సుమారు 26 క్వింటాళ్ల బియ్యాన్ని ఇటుక బట్టీల్లో పనిచేసే కూలీలకు విక్రయించేందుకు తరలిస్తున్నట్లు నిర్ధారణ అయింది. నిందితుడిపై 7 ఈసీ పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి బియ్యా న్ని పౌరసరఫరాల శాఖకు అప్పగించారు.

నిందితుడిని కోర్టులో హాజరు పరిచి రిమాం డ్కు తరలించినట్లు ఇన్‌స్పెక్టర్ మక్బూల్ జానీ మీడియాకు వెల్లడించారు. ప్రజలు అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.