8 April, 2026 | 2:21 AM

జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలిసిన ఆమనగల్ బార్ అసోసియేషన్ ప్రతినిధులు

08-04-2026 12:29 AM

ఆమనగల్, ఏప్రిల్ 7 (విజయక్రాంతి): ఆమనగల్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన అండే కార్ యాదిలాల్ ఆధ్వర్యంలో మంగళవారం అసోసియేషన్ ప్రతినిధులు జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి కర్ణ కుమార్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు.

ఆమనగల్లులో నూతన కోర్టు భవన నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేయాలని న్యాయమూర్తిని కోరారు. సీనియర్ కోర్టును షాద్నగర్ నుండి మహేశ్వరం పరిధిలోకి మార్చాలని విజ్ఞప్తి చేశారు. కోర్టు భవన నిర్మాణం కోసం తగిన స్థలాన్ని కేటాయించాలని కోరుతూ ఇప్పటికే ఆమనగల్ తహసీల్దార్కు (MRO) వినతిపత్రం అందజేసినట్లు ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.

కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది లక్ష్మణ శర్మ, ఉపాధ్యక్షులు శేఖర్, ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్, సంయుక్త కార్యదర్శి మధు గౌడ్, కోశాధికారి మల్లేష్, గ్రంథాలయ కార్యదర్శి గణేష్ గౌడ్, క్రీడా కార్యదర్శి సంతోష్ కుమార్ పాల్గొన్నారు. వీరితో పాటు కార్యవర్గ సభ్యులు దేవేందర్ గౌడ్, సర్దార్ నాయక్, న్యాయవాదులు రామకృష్ణ, మల్లేష్, జగన్ గౌడ్, మధు గౌడ్, ప్రభు నాయక్, మహేశ్వర్, శ్రీశైలం, మహేష్ తదితరులు పాల్గొన్నారు.