‘యశోధ’ చైర్మన్ రవీందర్‌రావుకు విద్యాదాత పురస్కారం
- వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రదానం
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 12 (విజయక్రాంతి): ఏ ఆధారం లేక, జీవితంలో ఎలా ముందుకు సాగాలో తెలియక నిస్సహాయులుగా నిలిచిపోతున్న అనాథ పిల్లలకు యశోధ గ్రూప్ ఆఫ్ హాస్పటల్స్ వ్యవస్థాపకుడు, యశోధ ఫౌండేషన్ చైర్మన్‌కు గోరు కంటి రవీందర్‌రావు అండగా నిలిచారని పలువురు వక్తలు కొనియాడారు. తెలంగాణ రాష్ట్రంలో రవీందర్‌రావు చేసిన సేవలకు గుర్తింపుగా ఆయనకు వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘విద్యాదాత’ పురస్కారాన్ని ప్రకటించారు.
రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో వందేమాతరం ఫౌండేషన్ వ్యవస్థాపకుడు రవీందర్, విశ్రాంత ఐఏఎస్ జయప్రకాశ్‌నారాయణ, సెయింట్ సంస్థ వ్యవస్థాపకుడు బీవీఆర్ మోహన్‌రెడ్డి, విద్యాశాఖ కమిషనర్ దేవసేన.. రవీందర్‌రావుకు ఈ అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అనాథ పిల్ల లకు అండగా నిలిచి, వారి ప్రతిభా పాఠవాలను పెంపొందించుకోవడానికి రవీందర్ రావు కృషి చేశారని కొనియాడారు. ‘విద్యాదాత’ అవార్డు తన బాధ్యతను మరింత పెంచిందని, సమాజానికి తన వంతు సహాయసహకారాలు అందించేందుకు కృషి చేస్తా నని రవీందర్‌రావు చెప్పారు






