మధ్యలోనే చదువు ఆపవద్దు
బడి ఈడు పిల్లలు బడిలోనే ఉండాలని, పనుల్లో కాదని, చదువును మధ్యలోనే ఆపవద్దని అధికారులు, ప్రజాప్రతినిధులు అన్నారు. బుధవారం పలు ప్రాంతాల్లో నిర్వహించిన ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవంలో వారు మాట్లాడారు. ఎన్ని కష్టాలు వచ్చిన పిల్లల చదువులను మధ్యలోనే ఆపి పనికి పంపవద్దని తల్లితండ్రులకు సూచించారు. బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం ప్రారంభమైన నాటి నుంచి బాల కార్మికులు చాలా వరకు తగ్గారని, పూర్తిస్థాయిలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు అందరూ భాగస్వామలు కావాలని కోరారు.
జయశంకర్ భూపాలపల్లి, జూన్ 12(విజయక్రాంతి): ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో బుధవారం భూపాలపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సమావేశంలో జిల్లా సీనియర్ సివిల్ న్యాయాధికారి జయరాంరెడ్డి మాట్లాడారు. బాలల చట్టాలకు సంబంధించి ఏ న్యాయ సహాయం కావాలన్నా జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించాలని సూచించారు.
సాధన సంస్థకు అభినందనలు..
కామారెడ్డి, జూన్ 12 (విజయక్రాంతి): 0 సంవత్సరాలలోపు పిల్లల ప్రయోజనాల కోసం సాధన ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో చేస్తున్న అవగాహన కార్యక్రమాలు అభినందనీయమని కామారెడ్డి ఎస్పీ సింధుశర్మ అన్నారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో సింధుశర్మ చేతుల మీదుగా సాధన ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో బాల కార్మిక వ్యతిరేక దినోత్సవ పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సాధన సంస్థ కో కొప్పుల రవి, ఆక్సెక్ టు జస్టిస్ ఫర్ ఆల్ ప్రాజెక్ట్ ప్రతినిధులు పాల్గొన్నారు.
విద్య ప్రాథమిక హక్కు
ఆదిలాబాద్, జూన్12 (విజయక్రాంతి): విద్య అనేది పిల్లల ప్రాథమిక హక్కు అని, అందరు చదువుకుని ఉన్నతంగా ఎదగాలని ఆదిలాబాద్ జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదరి (డీఎల్‌ఎస్‌ఏ) సౌజన్య అన్నారు. డీఎల్‌ఎస్‌ఏ, జిల్లా మహిళా సాధికారత కేంద్రం, మహిళా శిశు సంక్షేమ శాఖ సంయుక్తంగా ఓ ప్రైవేట్ పాఠశాలలో నిరహించిన కార్యక్రమంలో ఆమె ప్రసంగిం చారు. విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, పిల్లల తల్లిదండ్రులకి పలు అంశాలపై అవగాహన కల్పించారు.






