18 May, 2026 | 11:48 AM

కొనుగోలు కేంద్రాలను, రైస్ మిల్లను అకస్మిక తనిఖీ చేసిన ఆర్డిఓ

18-05-2026 10:41 AM

వెల్దుర్తి,(విజయక్రాంతి): వెల్దుర్తి మండలంలో ఆదివారం కొనుగోలు కేంద్రాలను, రైస్ మిల్లు లను ఆకస్మిక తనిఖీ చేసిన తుప్రాన్ ఆర్డీవో జయ చంద్రారెడ్డి, అనంతరం తహసిల్దార్ కార్యాలయంలో, తాహా సిల్దార్, ఆర్ఐ,  ఏఎస్ఐ,పిఎసిఎస్,ఐకెపి కొనుగోలు కేంద్రాల ఇన్చార్జిలు, అలాగే గ్రామ పాలన అధికారులతో, సమావేశం ఏర్పాటు చేసి మండలంలో గల అన్ని సెంటర్లలో ఎంత ధాన్యము తూకం అయినది, సెంటర్లలో జాప్యము, హమాలీ కొరత, లారీలు, రైస్ మిల్లర్లు సకాలంలో ధాన్యం బస్తాలు తీసుకున్నారా లేదా అనే దానిపై ఆరా తీశారు.

ఇందులో భాగంగా వెల్దుర్తి మండలంలో నాలుగు రైస్ మిల్లులు ఉన్నావని వాటికి మెదక్ పౌరసరఫరాల శాఖ నుండి ఎన్ని క్వింటాల ధాన్యం తీసుకొనుటకు ఉత్తర్వులు ఇచ్చినారని, వాటి ప్రకారం నేటి వరకు ఎంత ధాన్యం తీసుకున్నారు అనే విషయం తెలుసుకున్నారు. అలాగే ప్రతి మిల్లుకు ఇచ్చిన కెపాసిటీని బట్టి వారు ధాన్యాన్ని ఖచ్చితంగా తీసుకొవాలని తెలియజేసినారు. జిల్లా కలెక్టర్  ఆదేశాల ప్రకారం ప్రతి ఒక్క రైస్ మిల్లు యజమాని మండలంలోని అందరి రైతులకు సంబంధించిన ధాన్యం త్వరితగతిన తీసుకోవాలని తెలిపారు.

అలాగే కొద్ది రోజులలో వర్షం వచ్చే సూచన ఉన్నందున సెంటర్ ఇన్చార్జి లకు ధాన్యం తూకమును త్వరాగా చేసి మిల్లులకు పంపించుటకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే రైస్ మిల్లు యజమానులు వడ్లు తీసుకొని ఎడల వారిపై కఠిన చర్యలు తీసుకొనుటకు  వారి యాజమాన్యంపై బైండోవర్ కేసులు నమోదు చేయుటకు హెచ్చరించినారు.అలాగే ఆర్డీవో  హస్తాల్పూర్ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని, శ్రీ బాలాజీ రైస్ మిల్లును అలాగే వెల్దుర్తి లో గల మహాగణపతి రైస్ మిల్ ను సందర్శించి వారి యజమానులతో మాట్లాడి వచ్చిన లారీలను ఎట్టి పరిస్థితుల్లోనూ త్వరగా ఖాళీ చేసి పంపించేందుకు సహకరించాలని మిల్లు యజమాలను కోరారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ శ్రీనివాస్ ఆరే నర్సింగ్ యాదవ్ ఏఎస్ఐ సిబ్బంది పాల్గొన్నారు.