28 June, 2026 | 2:17 AM

ప్రజా పాలనతో ప్రజలకు చేరువ

28-06-2026 01:07 AM

జిల్లా ప్రత్యేక అధికారి శైలజా రామయ్యర్

సిరిసిల్ల, జూన్ 27 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో పాలన ప్రజలకు మరింత చేరువైందని జిల్లా ప్రత్యేక అధికారి, దేవాదాయ శాఖ, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ ప్రిన్సిపల్‌సెక్రటరీ శైలజా రామ య్యర్ అన్నారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో శనివారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఆమెకు కలెక్టర్ గరిమ అగర్వాల్ పుష్పగుచ్ఛం అందజేసి ఘనస్వాగతం పలికారు.

మార్చి 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజుల కార్యాచరణను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌లో పరిశీలించారు. 99 రోజుల విజయాలను డాక్యుమెంటరీ రూపంలో సిద్ధం చేయాలని శైలజా రామయ్యర్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వాదేశాలకు అనుగుణంగా ప్రణాళికలను అమలు చేయడం పట్ల కలెక్టర్‌ను అభినందించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, అదనపు ఎస్పీ చంద్రయ్య, డీఆర్‌ఓ జయశ్రీ, సీపీఓ శ్రీనివాసాచారి, జడ్పీసీఈవో వెంకటమాధవరావు, డీఆర్డీఓ లక్ష్మీనారాయణ, జిల్లా పశువైద్యాధికారి రవీందర్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు పాల్గొన్నారు.