calender_icon.png 12 February, 2026 | 9:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్ధం

12-02-2026 07:36:16 PM

కలెక్టర్ హనుమంత రావు

ఆలేరు,(విజయక్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆరు మున్సిపాలిటీలలో నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంత రావు,స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, అడిషనల్ ఎస్పీ లక్ష్మీనారాయణ తో కలసి ఈ రోజు పరిశీలించి, సర్వం సిద్ధం చేశారు. దివ్య బాల స్కూల్ లో ఏర్పాటు చేసిన కౌంటింగ్ సెంటర్లో ఏర్పాట్లను కలెక్టర్ సమగ్రంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు, టేబుల్ అమరికలు, సీసీటీవీ పర్యవేక్షణ, భద్రతా చర్యలు, ప్రవేశ–నిష్క్రమణ మార్గాలు, త్రాగునీరు, సదుపాయాలు, విద్యుత్ సరఫరా, ఇతర మౌలిక వసతులపై విపులంగా పరిశీలించి, కౌంటింగ్ ప్రక్రియను ఎన్నికల నియమావళి ప్రకారం పారదర్శకంగా, ఎలాంటి అంతరాయం లేకుండా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉంచాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. 

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కౌంటింగ్ ప్రక్రియ ఎన్నికలలో అత్యంత కీలక దశ. ప్రతి అంశంలో భద్రతా ప్రమాణాలు పాటిస్తూ, పారదర్శకత మరియు సమయపాలనతో కౌంటింగ్ నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమం లో స్పెషల్ ఆఫీసర్స్,రెవిన్యూ డివిజనల్ అధికారి కృష్ణారెడ్డి, నాగిరెడ్డి, మున్సిపల్ కమీషనర్ లు, పోలీస్ సిబ్బంది సంబంధిత అధికారులు పాల్గొన్నారు.