5 August, 2026 | 3:32 PM

నీటి హక్కులపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు

05-08-2026 02:58 PM

చంద్రబాబు చెపిన మాటలు నిజామా.. లేఖలు నిజమా?

నీటి విషయంలో అన్యాయం జరిగితే తెలంగాణ ఊరుకోదు

హైదరాబాద్: తెలంగాణ ప్రాజెక్టులను(Telangana projects) అడ్డుకోలేదని చంద్రబాబు చెప్పారని తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి హరీశ్ రావు(Former Minister Harish Rao) సూచించారు. గోదావరిపై ప్రాజెక్టులకు తాను వ్యతిరేకం కాదని చంద్రబాబు చెప్పారని తెలిపారు. చంద్రబాబు చెప్పిన మాటలు నిజామా.. లేఖలు నిజమా? అని ప్రశ్నించారు. ఏపీ ప్రతిపాదిస్తే తెలంగాణ ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని జీఆర్ఎంబీ ఎజెండాలో పెట్టారని విమర్శించారు. మా ప్రాజెక్టులు ఆపాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశారని ఆగ్రహించారు. మీ మాటలకు,చేతలకు ఎలాంటి పొంతన లేదని మండిపడ్డారు. చంద్రబాబు.. తెలంగాణ బువ్వ లాక్కునే యత్నం చేస్తున్నారని ఆరోపించారు.

కేంద్రం మీ చేతుల్లో ఉందని తెలంగాణ హక్కులు కాలరాస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ నీటి హక్కులపై(Telangana's Water Rights) ఒక్క అంగుళం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. కాళేశ్వరం అనుమతులు(Kaleshwaram clearances) రద్దు అంటే సగం తెలంగాణకు అన్యాయం చేయడమే అన్నారు. సీతారామ అడ్డుకోవడమంటే ఖమ్మం జిల్లాకు అన్యాయం చేయడమే అన్నారు. తెలంగాణలో తాగు, సాగునీరు దూరం చేసే కుట్ర జరుగుతోందని తెలిపారు. చిన్న కాళేశ్వరం అనుమతులు రద్దు చేయాలని ఏపీ ప్రతిపాదన చేసిందన్నారు. ఏపీ ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా జీఆర్ఎంబీ అజెండాలో చేర్చిందన్నారు.

జీఆర్ఎంబీలో ఉన్ తెలంగాణ ఇంజినీర్లు మౌనంగా ఎందుకు అంగీకరించారు. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పరోక్షంగా అంగీకరించారా?, రేవంత్ సహకారంతో ఎజెండాలో చేరిందని అనుమానం ఉందన్నారు. ఏపీ, కేంద్ర ప్రభుత్వం కుమ్మక్కు రాజకీయాలతోనే అజెండాలో చేరిందన్నారు. ఏపీ, కేంద్ర ప్రభుత్వం కలిసి తెలంగాణ గొంతు కోయాలని చూస్తున్నారని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాల్సిన బాధ్యత కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కు ఉందా.. లేదా?, తెలంగాన బీజేపీ ఎంపీలు.. రాష్ట్ర హక్కులు కాపాడేందుకు ముందుకు వస్తారా? అని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు.