అక్రమ ఇసుక తవ్వకాలను అడ్డుకోండి
14-08-2026 04:20 PM
ఇరిగేషన్ అధికారులకు మాజీ జెడ్పిటిసి ఫిర్యాదు
తాండూరు,(విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా యాలాల మండలం విశ్వనాథ్ పూర్ సమీపంలో ఉన్న కాకర వేణి ప్రాజెక్టు నుండి ఇసుక అక్రమ తవ్వకాలను అడ్డుకోవాలని మాజీ జడ్పిటిసి సభ్యులు సిద్రాల శ్రీనివాస్ శుక్రవారం ఇరిగేషన్ ఈ ఈ కు ఫిర్యాదు చేశారు.
భారీ యంత్రాల ద్వారా ఇసుక తవ్వకాలు జరపడంతో ఎక్కడపడితే అక్కడ గుంతలు పడి ప్రాజెక్టు రూపురేఖలు మారిపోతున్నాయని ప్రమాదం జరిగి ప్రాణాలు పోయే అవకాశం ఉందని, భూగర్భ జలాలు సైతం అంతరించిపోయి భవిష్యత్తులో పరిసర రైతులకు సాగునీటి అవసరాలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వెంటనే ఇసుక అక్రమ తవ్వకాలను నిలిపివేయాలని ఆయన ఇచ్చిన ఫిర్యాదులు కోరారు.






