14 August, 2026 | 5:55 PM

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అండగా ఉంటాం

14-08-2026 04:18 PM

- సర్పంచ్ గొడిసెల రాజేశం 

లక్షెట్టిపేట,(విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఎల్లారం గ్రామ సర్పంచ్ గొడిసెల రాజేశం అన్నారు. శుక్రవారం గ్రామపంచాయతీలోని ప్రాథమిక పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు సర్పంచ్ తన సొంత ఖర్చులతో క్రీడా దుస్తులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువుతో పాటు విద్యార్థులు ఆటల్లో సైతం రాణించాలన్నారు. నేడు క్రీడాకారులకు ప్రభుత్వం నుంచి అన్ని రకాల సౌకర్యాలు అందుతున్నాయని తెలిపారు. క్రీడలపై చిన్నతనం నుంచే ఆసక్తిని పెంచుకోవాలని, తల్లిదండ్రులు కూడా పిల్లలను ప్రోత్సహించాలని కోరారు.

డ్రెస్ కోడ్ అనేది విద్యార్థులను ఆటల వైపు ఆకర్శించేలా చేస్తుందన్నారు. రానున్న రోజుల్లో స్కూల్ యూనిఫామ్, టై, బెల్ట్ కూడా ఇవ్వనున్నట్లు వెల్లడించారు. గ్రామంలోని తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని విజ్ఞప్తి చేశారు.అనంతరం ఏం ఈ ఓ శైలజ తో కలిసి విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్ లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు ఉమ, పంచాయతీ సెక్రెటరీ వరుణ్, ఉపాధ్యాయులు, వార్డు సభ్యులు, తల్లిదండ్రులు, పాల్గొన్నారు.