1 March, 2026 | 2:30 AM

రికార్డ్ అసిస్టెంట్ ఆత్మహత్య

01-03-2026 12:35 AM
  1. కళాశాల భవనం పైనుంచి దూకి బలవన్మరణం
  2. కామారెడ్డి జిల్లా దేశాయిపేటలో ఘటన

బాన్సువాడ, ఫిబ్రవరి 28 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం దేశాయిపేట ఎస్‌ఆర్‌ఎన్‌కె ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రికార్డ్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న షేక్ అహ్మద్(50) శనివారం కళాశాల భవనం పైనుండి దూకి ఆత్మ హత్య చేసుకున్నాడు. అతడికి మద్య సేవించే అలవాటు ఉందని, రంజాన్ ఉండటంతో మానేయడంతో అతడి ప్రవర్తనలో మార్పులు వచ్చినట్టు సహా ఉద్యోగులు తెలిపారు. శనివారం బాన్సువాడ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన కుటుంబ సభ్యులు చంపేస్తామని బెదిరిస్తున్నారని ఫిర్యాదు చేసినట్టు వారు తెలిపారు. కాగా ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.