17 April, 2026 | 3:10 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయా దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

భూదాన్ భూముల కుంభకోణం!

01-03-2026 12:26 AM
  1. లక్ష ఎకరాలు ఏమయ్యాయి?
  2. ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి
  3. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న డిమాండ్

హైదరాబాద్, ఫిబ్రవరి 28 (విజయక్రాంతి): తెలంగాణలో భూదాన్ భూములు అన్యాక్రాంతం అయ్యాయని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ధ్వజమెత్తారు. ఖమ్మం వెలుగుమట్లలో పేదల ఇళ్లను కూల్చివేయడం హిమశైలం అంచు మాత్రమేనని, రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది ఎకరాల భూదాన్ భూము లు రాజకీయ నాయకులు, రియల్ మాఫి యా చేతుల్లో బందీ అయ్యాయని ఆరోపించారు.

తెలంగాణలో వినోబా భావే సేకరిం చిన 1.82 లక్షల ఎకరాల భూదాన్ భూములపై తక్షణమే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలని, ఏయే జిల్లాలో ఎంత భూమి ఆక్రమణకు గురైందో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. రికార్డుల ప్రకారం ఉండాల్సిన భూమిలో దాదాపు లక్ష ఎకరాలకు పైగా క్షేత్రస్థాయిలో మాయమయ్యా యని, ముఖ్యంగా రంగారెడ్డి, మేడ్చల్, యాదాద్రి, ఖమ్మం జిల్లాల్లో వేల కోట్ల రూపాయల విలువైన భూములను రియల్ ఎస్టేట్ గద్దలు మింగేశాయని, వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాం డ్ చేశారు.

ఆక్రమణల నుంచి విడిపించిన భూములను నిరుపేదలకు, దళిత, గిరిజన కుటుంబాలకు పంచాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న భూదాన్ భూముల రక్షణ కోసం బాధితులందరినీ ఏకం చేసి ’చలో అసెంబ్లీ’ నిర్వ హిస్తామని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా 1.82 లక్షల ఎకరాల భూమిలో కేవలం 1.14 లక్షల ఎకరాలే పంచారని, మిగిలిన 68 వేల ఎకరాల భూమి ఏమైందని ప్రశ్నించారు. ‘హైదరాబాద్ చుట్టూ ఉన్న రంగారెడ్డి జిల్లాలో 21వేల ఎకరాల భూదాన్ భూమి ఉంటే, అందులో 13వేల ఎకరాలు ఆక్రమణకు గురైనట్టు రిపోర్టులు చెపుతున్నాయని వివరించారు. దీనిపై ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉన్నదని ప్రశ్నించారు.