27 July, 2026 | 9:41 PM

మల్లయ్య ఆరోపణలు శుద్ధతప్పు

27-07-2026 09:06 PM

ఉమ్మడి నల్గొండ జిల్లా మలిదశ ఉద్యమకారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు, కాంగ్రెస్ నాయకులు రాయపూడి వెంకటనారాయణ

కోదాడ,(విజయక్రాంతి): అభివృద్ధి ముసుగులో అవినీతి జరుగుతుందని కోదాడ మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్  చేసిన ఆరోపణలు శుద్ధ తప్పని ఉమ్మడి నల్గొండ జిల్లా మలిదశ ఉద్యమకారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు, కాంగ్రెస్ నాయకులు రాయపూడి వెంకటనారాయణ అన్నారు కోదాడ పట్టణంలో జరుగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు సి ఓ టి లెవెల్ లోనే టెండర్లు  కన్ఫామ్ అయ్యాయని దీంట్లో ఎటువంటి అవినీతి జరగలేదని ఆయన అన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు టెండర్ విలువ 258 కోట్లని దీనికి సంబంధించిన ప్రాజెక్టు రిపోర్టును మల్లయ్య యాదవ్  వాట్సాప్ కు  ట్విట్టర్ కు పంపుతానని ఆయన అన్నారు  జనావాసాలు తక్కువ ఉన్నచోట  6 ఇంచులు కొద్దిగా ఎక్కువగా ఉన్నచోట 8 ఇంచులు అలాగే కొన్ని ప్రదేశాలలో అడుగు కొన్ని ప్రదేశాలలో   అడుగున్నర పైపులు వస్తాయని తెలిపారు. జనవరి 2028 వరకు ఈ ప్రాజెక్టు కంప్లీట్ కావాలని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి  దృఢ సంకల్పం ప్రాజెక్టు మొత్తం కంప్లీట్ కాగానే దీని ఉపయోగాలు తెలుస్తాయి తప్ప అప్పటివరకు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది ప్రజలు దీనిని గమనించాలని కోరారు.